పంతులుగా మారిన వరుడు.. తన పెళ్లి మంత్రాలు తానే చదువుకున్నాడు
హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహాల్లో కచ్చితంగా పూజారి ఉంటారు. ఆయన వేదమంత్రాలు చదువుతుండగా, వివాహ బంధంలోకి అడుగుపెడతారు నూతన వధూవరులు. ఏడడుగులు నడిచి తమ కొత్త జీవితాలను మొదలుపెడతారు. ఇది అనేక పెళ్లిళ్లలో మనం చూసే ఉంటాం. కానీ ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమారుడే పంతులయ్యాడు!
స్వయంగా మంత్రాలు చదువుకుంటూ వివాహ తంతును పూర్తి చేశాడు. అది కూడా మరో పూజారి పర్యవేక్షణలో వేద మంత్రాలు చదివాడు. వివాహానికి చెందిన అన్ని ఆచార వ్యవహారాలు తెలిసిన ఆయనపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. సహరన్‌పుర్ జిల్లాలోని రాంపుర్ మణిహరన్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్‌కు హరిద్వార్ జిల్లాలోని కుంజా బహదూర్‌పుర్ గ్రామ నివాసి అయిన అనిల్ కుమార్ కుమార్తెతో కొన్ని రోజుల క్రితం వివాహ సంబంధం నిశ్చయమైంది. ఇటీవల వివాహం జరిపించాలని నిర్ణయించుకోగా, వివేక్ కుమార్ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వెళ్లాడు. ఆ తర్వాత వేదికపై శుభ ముహుర్తంలో వధూవరులిద్దరూ పూలమాలలు మార్చుకున్నారు. ఆ తర్వాత హోమం చేసి, మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంది. అదే సమయంలో వరుడు తన వివాహ ఆచారాలను తానే నిర్వహిస్తానని పూజారికి చెప్పాడు. మతపరమైన ఆచారాల మంత్రాలను కూడా తానే స్వయంగా పఠిస్తానని తెలిపాడు. అనంతరం వరుడు మంత్రాలు జపించడం ప్రారంభించగా, అందరూ చప్పట్లు కొట్టారు. వివాహ ఆచారాల మంత్రాలన్నింటినీ ఎలా పఠించాలో తెలుసని చెప్పాడు వివేక్. మతపరమైన ఆచారాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే వేదమంత్రాలను పఠించడం నేర్చుకున్నానని అన్నాడు. మొత్తానికి వివేక్ వివాహం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు
బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్
అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా
7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

