షాకింగ్ ట్విస్ట్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసొచ్చాక చంపేశాడు!
హైదరాబాద్ మీర్‌పేట హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత పాశవికమైన హత్య ఇది. చంపిన తీరు వినాలంటేనే భయమేస్తుంది. హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను చంపిన భర్త కేసు గురించి వింటేనే జుగుప్సాకరంగా ఉంది. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఈ నెల 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఇంటికి వచ్చారు గురుమూర్తి దంపతులు.
అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు మాధవి, గురుమూర్తి. ఆ తర్వాతే చిన్న గొడవ జరిగి హత్యకు దారి తీసినట్టు పోలీసులు చెప్తున్నారు.తెల్లారిన తర్వాత పండుగకు పుట్టింటికి పంపాలని భర్తను కోరింది మాధవి. ఇందుకు గురుమూర్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవలో మాధవిను కొట్టాడు గురుమూర్తి. ఒక్క దెబ్బకే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గురుమూర్తి ఆందోళనకు గురయ్యాడు. డెడ్‌బాడీని మాయంచేస్తే మాధవి హత్య బయటకి రాదని అనుకున్నాడు. ఒక్క ఆధారం లేకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి చెరువులో కలిపేశాడు గురుమూర్తి.