ఇదేం వింత .. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు..!
సాధారణంగా మేక రెండు, లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. అలాంటిది ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేక .. ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
సాధారణంగా మేక రెండు, లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. అలాంటిది ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేక .. ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా, ఒకటి మగ పిల్ల ఉంది. పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండి చెంగుచెంగున దుంకుతుంటే వీటిని చూడడానికి గ్రామస్తులు ఆసక్తి కనబరిచారు.