రెడ్ కలర్ ఫుడ్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?
ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు అంటే చాలా మంది వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. కానీ వీటిలో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే వదిలిపెట్టరు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తాయి. ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎరుపు రంగులో మెరిసే రెడ్ బెల్ పెప్పర్స్ వంటకాల అందాన్ని పెంచడంతో పాటు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రెడ్ బెల్ పెప్పర్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.ఎర్రగా మెరిసే టమోటాలకు ప్రతీ వంటకంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిలో లైకోపీన్, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమోటాలు గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించడం, క్యాన్సర్‌లను నిరోధించడం వీటి ప్రధాన లక్షణాలు. తక్కువ కేలరీలతో పాటు అధిక ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలని కోరుకునే వారి ఆహారంలో టమోటాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే రెడ్ క్యాబేజీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
వైరల్ వీడియోలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
