Actress Asin : అయ్య బాబోయ్.. హీరోయిన్ అసిన్ భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే.. అసలేం చేస్తాడంటే..
దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అసిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అసిన్. ఇంతకీ ఈ హీరోయిన్ భర్త బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన గజిని సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అన్నవరం, చక్రం వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యింది. ఇక తెలుగుతోపాటు, హిందీ, తమిళంలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన బిజినెస్ మ్యాన్ రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 2016లో ఘనంగా జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది అసిన్. అలాగే నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అసిన్.. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అసిన్ భర్త గురించి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది.
అసిన్ భర్త రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో. భారతదేశ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఫేమస్ పర్సన్. ఫోర్బ్స్, DNA , వివిధ ఆన్‌లైన్ మూలాల ప్రకారం, శర్మ 2000లో తన స్నేహితులైన రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరాతో కలిసి మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించినప్పుడు తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాడు. వెంచర్‌ను ప్రారంభించేందుకు నివేదికల ప్రకారం శర్మ తన తండ్రి నుండి రూ.3 లక్షల రుణం తీసుకున్నాడు. IT సాఫ్ట్‌వేర్ కంపెనీగా మొదలైన మైక్రోమ్యాక్స్ 2008లో మొబైల్ వ్యాపారంలోకి ప్రవేశించింది. 2010 నాటికి సరసమైన ఫోన్‌ల తయారీలో భారతదేశపు అగ్రగామిగా మారింది. ముఖ్యంగా, హాలీవుడ్ నటుడు హ్యూ జాక్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ప్రపంచం మొత్తం ఈ సంస్థ పేరు మారుమోగింది.
నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.1300 కోట్లు. తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, శర్మ కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి ఉన్నారు. 2012లో తన ‘క్లోజ్ ఫ్రెండ్’ రాహుల్ శర్మకు అసిన్‌ను పరిచయం చేశారు. అప్పడు మొదలైన వారిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.
నివేదికలు ఢిల్లీ నడిబొడ్డున రాహుల్ శర్మకు అందమైన ఫామ్‌హౌస్ ఉంది. అలాగే అతడి వద్ద హై-ఎండ్ ఆటోమొబైల్స్ ఉన్నాయి. బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, BMW X6, మెర్సిడెస్ GL450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 వంటి కార్లు ఉన్నాయి.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








