Actress: ఫీజు కట్టడానికి డబ్బు లేక 10వ తరగతి తర్వాత చదువు మానేసింది.. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు..
ప్రస్తుతం తన యాక్టింగ్, ప్రతిభతో సినీపరిశ్రమను ఏలుతున్న నటి ఆమె. కానీ ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి సైతం డబ్బులు లేక ఇబ్బందులు పడింది. దీంతో 10వ తరగతి తర్వాత చదువు మానేసింది. ఎన్నో కష్టాలతో కెరీర్ నిర్మించుకున్న ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ యాక్టర్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సినీరంగుల ప్రపంచంలో తమదైన నటనతో, ప్రతిభతో ఆకట్టుకుంటున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ వెండితెరపై అలరించిన సెలబ్రెటీల జీవితాలు అంత విలాసవంతంగా సాగవు. నటీనటులుగా ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిన వారే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది అనేక పోరాటల తర్వాత తమ కెరీర్ నిర్మించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తార సైతం జీవితంలో అనేక ఒడిదుడుకులను చూసింది. మంచి, చెడు రెండు పరిస్థితుల్లోనూ తమ అద్భుతమైన భవిష్యుత్తును నిర్మించుకోవడానికి ధైర్యంగా నిలబడింది. ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేసింది. కానీ ఇప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవరో కాదు.. తేజస్విని పండిట్.
తేజస్విని 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ప్రస్తుతం ఆమె మరాఠి, హిందీ చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం ఆమె ‘యే రే యే రే పైసా 3’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను నటనారంగంలోకి అడుగుపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని.. చిన్నప్పటి నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఉండేదని తెలిపింది. కానీ ఈ రెండు కోర్సులకు ఫీజులు రూ.80 వేల వరకు ఉన్నాయని.. తన తండ్రి డబ్బు లేకపోవడంతో ఆ చదువులు చదవలేదని తెలిపింది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
అలాగే తాను 12వ వంటి సాధారణ చదువు అభ్యసించాలని లేదని.. కొత్త రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నట్లు తెలిపింది. సినీరంగంలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సీరియల్స్, సినిమాలు చేస్తూ ఇప్పుడు ఇండస్ట్రీలోనే బిజీ నటిగా మారిపోయింది. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది తేజస్వి పండిట్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..



