Tollywood: వామ్మో.. ఒక్క ఎపిసోడ్‌కు రూ.3 లక్షలా..? ఒకప్పుడు ట్రావెల్ ఏజెన్సీలో జాబ్.. ఇప్పుడేమో..
భారతీయ సినీపరిశ్రమలో నటీనటులుగా రాణిస్తున్న చాలా మంది ఒకప్పుడు ఏదోక చిన్న ఉద్యోగం చేసినవారే. కానీ ఇప్పుడు వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం ఒకప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది. అప్పుడు ఆమెకు నెల జీతం కేవలం రూ.500. ఇప్పుడు ఆమె ఆస్తులు రూ.83 కోట్లు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సాధారణంగా సినిమా సెలబ్రెటీలతోపాటు టీవీ తారలకు సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై చాలా కాలంగా సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరైన తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటి మాత్రం టీవీ పరిశ్రమను కొన్ని సంవత్సరాలుగా ఏలుతుంది. ఒకప్పుడు నెలకు రూ.500 సంపాదించిన ఆమె.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.3 లక్షలు తీసుకుంటుంది. ఇంతకీ ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.83 కోట్లు. అంతేకాదు.. ఆమె వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో పాతికేళ్ల హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది. వెండితెరపై తనదైన నటనతో కట్టిపడేసిన ఆమె.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే శ్వేతా తివారీ. తన సంపాదన, విలాసవంతమైన జీవనశైలితో కూడా వార్తల్లో నిలుస్తోంది.
టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో శ్వేతా తివారీ ఒకరు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.83 కోట్లకు పైగా ఉంటుంది. ప్రతి ఏడాది రూ.10 కోట్లు సంపాదిస్తుంది. అలాగే శ్వేతా ఒక టీవీ ఎపిసోడ్‌కు రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తుంది. అటు సినిమాలు, సీరియల్స్, యాడ్స్, మోడలింగ్ ద్వారా సంపాదిస్తుంది. ‘కసౌతి జిందగీ కి’ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఆ త్రవాత బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి ప్రతి వారం రూ.5 లక్షలు సంపాదించింది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జన్మించిన శ్వేత 12 సంవత్సరాల వయస్సులో పనిచేయడం ప్రారంభించింది. మొదట్లో ఆమె ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం చేసింది. అప్పుడు ఆమెకు నెలకు కేవలం రూ. 500 జీతం మాత్రమే లభించింది. 15 సంవత్సరాల వయసులో, శ్వేత నటనా ప్రపంచంలోకి ప్రవేశించింది. ‘కసౌతి జిందగీ కి’ సీరియల్ తో రాత్రికి రాత్రే స్టార్ గా మారింది. ఆమె వద్ద ఇప్పుడు లగ్జరీ కార్లు సైతం ఉన్నాయి. శ్వేతకు రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి – BMW 7 సిరీస్, దీని ధర దాదాపు రూ. 1.4 కోట్లు, ఆడి A4, దీని ధర దాదాపు రూ. 45 లక్షలు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..






