AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: మాటలతో మాయ చేయాలన్నా.. సంచులకొద్దీ పంచులు వేయాలన్నా.. ఆయనకే చెల్లుతుంది..

టాలీవుడ్‌‌‌లో చాలా టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తన సినిమాలతో అన్ని వర్గాలను అలరిస్తూ టాప్ దర్శకుడిగా...

Trivikram Srinivas: మాటలతో మాయ చేయాలన్నా.. సంచులకొద్దీ పంచులు వేయాలన్నా.. ఆయనకే చెల్లుతుంది..
Trivikram Srinivas
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2021 | 9:14 AM

Share

Happy Birthday Trivikram Srinivas: టాలీవుడ్‌‌‌లో చాలా టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు..వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తన సినిమాలతో అన్ని వర్గాలను అలరిస్తూ టాప్ దర్శకుడిగా కొనసాగుతున్నారు త్రివిక్రమ్. నేడు ఈ మాటల మాంత్రికుడి పుట్టిన రోజు. త్రివిక్రమ్ సినిమాలోని మాటలు, డైలాగులు.. మన అమ్మో.. నాన్నో.. లేదంటే మనకు బాగా కావాల్సిన వ్యక్తి మన గురించి మానపక్కనే కూర్చొని చెప్తున్నట్టే ఉంటాయి. ఆయన సినిమాలోని సన్నివేశాలు కూడా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో అర్ధవంతంగా.. ప్రతి ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా చెప్పడం త్రివిక్రమ్ స్టైల్. ఇక త్రివిక్రమ్ సినిమాలో కథలు చాలా సింపుల్‌‌‌గా ఉంటాయి. స్టోరీ లైన్ చిన్నదే అయినా రెండున్నర గంటలు ప్రేక్షకుడిని థియేటర్స్‌‌‌లో కదలకుండా కూర్చోబెడుతుంటాయ్ ఆయన సినిమాలు.. అది అంత ఈజీ కాదు.. అందరివల్ల అసలే కాదు. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలను తన సినిమాలో చూపిస్తూనే చివరిగా ఓ సందేశాన్ని కూడా ఇస్తారు త్రివిక్రమ్.

ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అది కూడా ఆయన మాటలోనే చెప్పాలంటే ‘చెప్పే మనిషి..వినే టైం ను బట్టి విషయం విలువే మారిపోతుంది’.  మనం పట్టించుకోని చిన్న విషయాలను ఆయన తన సినిమాల్లో అర్ధమయ్యేలా చెప్తారు. ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ -రానా నటిస్తోన్న సినిమాకు మాటలు అందిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు గురూజీ. ఇక త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, సినిమా తారలు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie : జక్కన్నా మజాకా.. అదిరిపోయే ఆ సాంగ్ కోసం ఉక్రెయిన్‌‌‌‌కు పయనమైన ఆర్ఆర్ఆర్ టీమ్

Theaters Reopen: సినిమా ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు..

Sonu Sood: మానవత్వం పరిమళించిన మనస్తత్వం.. హ్యాపీ బర్త్ డే సోనూ భాయ్..

జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!