RRR Movie : జక్కన్నా మజాకా.. అదిరిపోయే ఆ సాంగ్ కోసం ఉక్రెయిన్‌‌‌‌కు పయనమైన ఆర్ఆర్ఆర్ టీమ్

తెలుగు ప్రేక్షకులతోపాటు యావత్ సినీలావర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠత్మకంగా..

RRR Movie : జక్కన్నా మజాకా..  అదిరిపోయే ఆ సాంగ్ కోసం ఉక్రెయిన్‌‌‌‌కు పయనమైన ఆర్ఆర్ఆర్ టీమ్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2021 | 8:36 AM

RRR Movie : తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీలావర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుంచి ఏదైనా ఆప్డేట్ విడుదల చేస్తారా అని ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి సినిమాగా మలిచి మనముందు తీసుకువస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ కొమురం భీంగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దర్శకు వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఒక్క పాట మినహా సినిమా అంతా పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పాటకోసం ఆర్ఆర్ఆర్ టీమ్ దేశం దాటి వెళ్లనుందని తెలుస్తోంది.

ఈ పాటని రాజమౌళి ఉక్రెయిన్‌‌‌‌లో సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న చిత్రయూనిట్ ఈ సాంగ్ షూటింగ్ కోసం ఉక్రెయిన్‌‌‌కు పయనమవ్వనున్నారట. ఆగస్ట్ రెండో వారం వరుకు అక్కడే షూటింగ్ జరుపుతారని సమాచారం. అంతే కాదు ఈ సాంగ్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నారట. ఈ పాట సినిమాకు మరో హైలైట్‌‌‌గా నిలుస్తోందని అంటున్నారు చిత్రయూనిట్. ఈ సాంగ్ కోసం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారట. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి త్వరలో ప్రమోషనల్ సాంగ్‌‌‌‌ను విడుదల చేయనున్నారు. ఇందుకోసం జక్కన భారీ ప్లానే వేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Theaters Reopen: సినిమా ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు..

Sonu Sood: మానవత్వం పరిమళించిన మనస్తత్వం.. హ్యాపీ బర్త్ డే సోనూ భాయ్..

Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?