Theaters Reopen: సినిమా ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు..

Theaters Reopen: థియేటర్‌లో సినిమా చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి ఇది గుడ్‌ న్యూస్. మళ్లీ థియేటర్ల ముందు సందడి మొదలు కాబోతోంది. సెకండ్‌ వేవ్‌తో మూత...

Theaters Reopen: సినిమా ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు..
theatres
Follow us

|

Updated on: Jul 30, 2021 | 8:40 AM

థియేటర్‌లో సినిమా చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి ఇది గుడ్‌ న్యూస్.  మళ్లీ థియేటర్ల ముందు సందడి మొదలు కాబోతోంది. సెకండ్‌ వేవ్‌తో మూత పడ్డ థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా మినహా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ్టి నుంచి సినిమాహాళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో అందుకు తగ్గట్టుగా యజమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. ప్రభుత్వం ఓ కండీషన్‌ విధించింది.

తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతోపాటు నాలుగు షోలకు అనుమతి ఇచ్చింది.ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో 3 షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది.  కరోనా కారణంగా గత కొంతకాలంగా తెలంగాణలో థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్డడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆ థియేటర్లలో తిమ్మరుసు, ఇష్క్..

300 పైగా థియేటర్స్‌లో తిమ్మరుసు.. మరో 300 థియేటర్లలో ఇష్క్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇవాళ తిమ్మరుసు, ఇష్క్, నరసింహపురం, ఇప్పుడుకాక ఇంకెప్పుడు, పరిగెత్తు పరిగెత్తు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ను బట్టి పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ లు ప్రకటించే అవకాశం ఉంది.

కరోనా నిబంధనలు…

ప్రేక్షకులు, సిబ్బంది సహా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న కండీషన్ ఉంది. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. భౌతిక దూరం పాటించాలి.. ప్రతి షో తర్వాత థియేటర్‌ను శానిటైజ్‌ చేయాలి. 24 నుంచి 30 డిగ్రీ సెల్సియస్‌ మధ్య ఏసీలను సెట్‌ చేయాలి. గాలి లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. వేర్వేరు ఆటలకు సంబంధించిన ఇంటర్వెల్స్‌ ఒకే సమయంలో ఉండకూడదు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు థియేటర్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

చాలా నెలల తర్వాత సినిమా హాళ్లు తెర్చుకోవడంపై సినీ లవర్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లలో సినిమాలు చూద్దామా అన్న సంతోషంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..

Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..