Pushpa 2: ఇదెక్కడి మాస్ రా మావా.! ఒక్క సీన్ కోసం 50 కోట్లు ఖర్చు చేశారా..!
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గానే కాదు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప రూల్' సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానుంది. దీని కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజానికి మొదటి భాగానికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గానే కాదు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప రూల్’ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానుంది. దీని కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజానికి మొదటి భాగానికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇటీవల అల్లు అర్జున్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్ళాడు. అక్కడ బన్నీ మాట్లాడుతూ.. పుష్ప సినిమా మూడవ భాగం కూడా ఉంటుందని ప్రకటించాడు. అలాగే సెకండ్ పార్ట్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక సీక్వెన్స్ కోసం భారీ గా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
పుష్ప2 సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందట.. దీని కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేయడమే కాకుండా 35 రోజుల పాటు షూట్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ పై సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి సన్నివేశాన్ని, కథను ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ‘గంగమ్మ తల్లి జాతర’లోని ఓ సన్నివేశాన్ని ‘పుష్ప 2’లో ఉంటుందట. ఇది ఇంటర్వెల్‌కు ముందు వస్తుందట.
ఈ సీన్ సినిమాలో ముఖ్యమైన భాగం. ఇది దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి 35 రోజులకు పైగా పట్టిందట. ఇది దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందట. అంతే కాకుండా ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ సీక్వెన్స్ ‘పుష్ప 2’లో చాలా కీలకం కానుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు అని అంటున్నారు. 30 నిమిషాల ఈ సీక్వెన్స్‌లో ఓ పాట, ఫైట్ సీన్, ఎమోషనల్ సీన్ కూడా ఉంటాయని అంటున్నారు. ఈ సీక్వెన్స్ తర్వాత కథలో కీలక మలుపు ఉంటుందని టాక్. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @MythriOfficial @TSeries pic.twitter.com/h4rwd3jKs2
— Sukumar Writings (@SukumarWritings) September 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




