AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidya Balan: ఎక్కడి వచ్చి ఏం చేస్తున్నావ్ రా బాబు.. విద్యాబాలన్‌ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి

విద్య బాలన్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియోలో నటి అభిమాని ఆమెను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు. విద్యతో పాటు వచ్చిన ఓ అమ్మాయి ఆ వ్యక్తిని పదేపదే తిరస్కరిస్తున్నట్లు వైరల్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఇదిలావుండగా విద్యాబాలన్ వైపు మొబైల్ చూపిస్తూ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు అతడు.

Vidya Balan: ఎక్కడి వచ్చి ఏం చేస్తున్నావ్ రా బాబు.. విద్యాబాలన్‌ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి
Vidya Balan
Rajeev Rayala
|

Updated on: Feb 28, 2024 | 9:20 PM

Share

గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ 26 ఫిబ్రవరి 2024న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి. నటి విద్యాబాలన్ కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చారు. అక్కడ ఆమె అభిమానుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్య బాలన్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియోలో నటి అభిమాని ఆమెను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు. విద్యతో పాటు వచ్చిన ఓ అమ్మాయి ఆ వ్యక్తిని పదేపదే తిరస్కరిస్తున్నట్లు వైరల్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఇదిలావుండగా విద్యాబాలన్ వైపు మొబైల్ చూపిస్తూ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు అతడు. అయితే విద్యాబాలన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు ఈ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో విద్యాబాలన్ ఆ వ్యక్తిని ఏమీ అనలేదంటూ జనాలు ఆమెను కొనియాడుతున్నారు.

కొందరు నెటిజన్స్ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. “సమయం ఏమిటో, స్థలం ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తులు కొందరు ఉన్నారు.” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  “కొంతమందికి హృదయం లేదు. “వారికి సెల్ఫీలు కావాలి అని కొందరు. మరికొందరు ఇడియట్ అని కామెంట్స్ చేస్తున్నారు. “ఆమె సెల్ఫీకి బదులుగా చెంపదెబ్బ కొట్టాలి.” అని రాసుకొచ్చారు.

మంగళవారం పంకజ్ అంత్యక్రియలకు సోనూ నిగమ్, అనూప్ జలోటా, తబలా మాస్ట్రో, జాకీర్ హుస్సేన్‌తో సహా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు తారలు హాజరయ్యారు. విద్యాబాలన్ కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు, అక్కడ సెల్ఫీ కోసం ఒక వ్యక్తి ఆమెను వేధించాడు. ఇక విద్య బాలన్ సినిమాల విషయానికొస్తే.. విద్యాబాలన్ త్వరలో కార్తీక్ ఆర్యన్, తృప్తి దిమ్రీలతో కలిసి ‘భులయ్యా 3’ చిత్రంలో మంజులిక పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా, ఆమె ‘దో ఔర్ దో ప్యార్’ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..