Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సన్నబియ్యం ధరలకు కళ్లెం!
తెలంగాణలో సన్నబియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం గరిష్ఠ చిల్లర ధరలను ఖరారు చేసింది. బీపీటీ, కేఎన్ఎం రకాల కిలో ధర రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రూ.79గా నిర్ణయించింది. నిర్ణయించిన ధరలను దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కూకట్‌పల్లిలో తనిఖీల సందర్భంగా ఆరు కేసులు నమోదు చేశారు.
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న సన్నబియ్యం ధరలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అక్రమ నిల్వలతో ధరలను అడ్డగోలుగా పెంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు.. శనివారం మిల్లర్లు, ట్రేడర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి వివిధ రకాల సన్నబియ్యం గరిష్ఠ చిల్లర ధరలను అధికారికంగా ఖరారు చేసింది. తాజా నిర్ణయం ప్రకారం.. మార్కెట్‌లో బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66 మించకూడదు. తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకం రూ.74గా, అలాగే హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాల ధరను కిలో రూ.79గా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయించిన ఈ ధరల పట్టికను ప్రతి దుకాణంలోనూ వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. అంతకుమించి ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన తనిఖీల్లో తూకంలో మోసాలు, ఎంఆర్‌పీ స్టిక్కర్ల ట్యాంపరింగ్‌ను గుర్తించి ఆరు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల సమయంలో కొందరు వ్యాపారులు షాపులు మూసివేసినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బియ్యం కొనుగోళ్లలో భారీ ఊరట లభించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు
నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి! అమ్మకోసం ఆయన ఏం చేశారో చూడండి!
కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!
శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ
ఇకపై తెలంగాణలో ఇన్‌స్టంట్ పింఛన్!ఎవరు అర్హులు?ఏ పత్రాలు కావాలి? ఎలా అప్లై చేయాలి?
కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు
వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ..
నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి!
శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

