AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు

కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు

Phani CH
|

Updated on: Nov 03, 2026 | 4:20 PM

Share

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఏరియా కూరగాయల మార్కెట్‌లో సంచిలో నుంచి భారీ నల్ల త్రాచు బయటకు రావడంతో కలకలం రేగింది. పామును చూసిన వ్యాపారులు, కొనుగోలుదారులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని డబ్బాలో బంధించారు. అనంతరం ఎలాంటి హాని చేయకుండా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో మార్కెట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో సడన్‌గా ఓ భారీ నాగుపాము ప్రత్యక్షమై జనాలను పరుగులు పెట్టించింది. మంచిర్యాల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉన్న కూరగాయల మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారుల సంచి లో నుంచి హఠాత్తుగా ఒక నల్ల త్రాచు బయటకు రావడం అందరినీ భయాందోళనకు గురిచేసింది. జనసందోహంతో సందడిగా ఉండే మార్కెట్ ప్రాంతంలో సంచిలో నుంచి పాము బయటకు రావడాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు, కొనుగోలుదారులు భయంతో పరుగులు తీశారు. కొందరు మాత్రం వెంటనే అలర్టయి స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్, అత్యంత చాకచక్యంగా ఆ నాగుపామును పట్టుకుని ఒక డబ్బాలో బంధించారు. స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా బంధించడంతో అక్కడ ఉన్న వ్యాపారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా, సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి భద్రంగా విడిచిపెట్టారు. మార్కెట్ లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి! అమ్మకోసం ఆయన ఏం చేశారో చూడండి!

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ

ఇకపై తెలంగాణలో ఇన్‌స్టంట్ పింఛన్!ఎవరు అర్హులు?ఏ పత్రాలు కావాలి? ఎలా అప్లై చేయాలి?

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది!

Follow Us