AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హీరో శివ కార్తికేయన్.. ఫొటోస్ వైరల్

సాధారణంగా సినిమా రిలీజై హిట్ అయ్యాక చిత్ర బృందానికి హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, నిర్మాతలు, బహుమతులు ఇస్తుంటారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం ఇంకా తన చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Sivakarthikeyan: సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హీరో శివ కార్తికేయన్.. ఫొటోస్ వైరల్
Sivakarthikeyan
Basha Shek
|

Updated on: Nov 04, 2026 | 7:05 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. ఆ సినిమా దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా సినిమా రిలీజై హిట్ అయ్యాక చిత్ర బృందానికి హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యులకు బహుమతులు ఇస్తుంటారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం ఇంకా తన చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన పరాశక్తి చిత్రంలో కనిపించారు శివ కార్తికేయన్. ప్రస్తుతం జాతీయ పురస్కార గ్రహీత, ‘పార్కింగ్’ చిత్ర దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నారు. ఎస్ కే 27 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ క్రమంలోనే ఫస్ట్ షెడ్యూల్ అవుట్‌పుట్ అద్భుతంగా రావడంతో పాటు దర్శకుడి టేకింగ్‌కు ఫిదా అయిన శివకార్తికేయన్.. దర్శకుడు బ్రాండ్ న్యూ ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. శివకార్తికేయన్ తనకు ఐఫోన్ 18 ప్రోను బహుమతిగా ఇచ్చినట్లు రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఐఫోన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘శివకార్తికేయన్ అన్న నుంచి ఎంతో ప్రేమతో కూడిన సర్‌ప్రైజ్ అందింది. ఈ బహుమతికి ధన్యవాదాలు అన్నా. ఇది నాకు నిజంగా ఎంతో ప్రత్యేకం’ అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్. ఇక ఎస్ కే 27 సినిమా విషయానికి వస్తే.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శివకార్తికేయన్‌కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకుయువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us