AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్‌ ఏం చేశాడో చూడండి!

వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్‌ ఏం చేశాడో చూడండి!

Phani CH
|

Updated on: Nov 03, 2026 | 3:41 PM

Share

‘అర్నబ్’ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామ సమీపంలో లారీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇసుక గెడ్డ కల్వర్టు దాటుతుండగా నీటి ఉధృతికి లారీ పడవలా తేలిపోయింది. డ్రైవర్ సూర్యప్రకాశ్ చెట్టును ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రవాహం తగ్గిన తర్వాత ఒడ్డుకు చేరుకుని ప్రమాదాన్ని తెలియజేశాడు. ఘటన నేపథ్యంలో అధికారులు కల్వర్టుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

‘అర్నబ్’ తుఫాను ధాటికి కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం సమీపంలో ఓ దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఇసుక గెడ్డ పొంగిపొర్లుతుండగా, కల్వర్టు పైనుంచి ప్రయాణిస్తున్న ఒక లారీ నీటి ప్రవాహంలో పడవలా కొట్టుకుపోయింది. కాకినాడ నుంచి ఆయిల్ డబ్బాల లోడుతో విజయనగరం వైపు వెళ్తున్న లారీ.. రెండు రోజుల క్రితం మద్ది కల్వర్టు వద్దకు చేరుకుంది. ప్రవాహ ఉధృతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన డ్రైవర్ జనపరెడ్డి సూర్యప్రకాశ్ లారీని ముందుకు పోనిచ్చారు. దాంతో ప్రవాహ వేగానికి లారీ ఒక్కసారిగా నీటిపై తేలిపోయి, కొద్దిదూరం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ లారీలోనే ఉండిపోయాడు. అదృష్టవశాత్తూ లారీ ప్రవాహంలో కొంతదూరం వెళ్లాక అక్కడ ఉన్న చెట్ల మధ్య ఇరుక్కుపోయి ఆగిపోయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్ సూర్యప్రకాశ్ వెంటనే లారీ నుంచి బయటకు వచ్చి, సమీపంలోని చెట్టును ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే, ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ఈ ప్రమాదాన్ని ఎవరూ గమనించలేకపోయారు. వర్షం తగ్గి ఇసుక గెడ్డ ప్రవాహ వేగం తగ్గిన తర్వాత డ్రైవర్ ఒడ్డుకు చేరుకుని స్థానికులకు విషయం తెలియజేయడంతో ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు కల్వర్టుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి! అమ్మకోసం ఆయన ఏం చేశారో చూడండి!

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ

ఇకపై తెలంగాణలో ఇన్‌స్టంట్ పింఛన్!ఎవరు అర్హులు?ఏ పత్రాలు కావాలి? ఎలా అప్లై చేయాలి?

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది!

Follow Us