AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంట్రా బాబూ.. ఇలా చూస్తున్నారు.. ఓటీటీలో గత్తరలేపుతున్న 300 కోట్ల డిజాస్టర్ సినిమా.. అటు యూట్యూబ్‌లోనూ రచ్చ..

ప్రస్తుతకాలంలో ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, హారర్ మూవీస్ కాకుండా ఈమధ్య చిన్న చిన్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా థియేటర్లలో డిజాస్టర్ అయిన చిత్రాలు అనుహ్యంగా ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం అలాంటిదే.

ఇదేంట్రా బాబూ.. ఇలా చూస్తున్నారు.. ఓటీటీలో గత్తరలేపుతున్న 300 కోట్ల డిజాస్టర్ సినిమా.. అటు యూట్యూబ్‌లోనూ రచ్చ..
Thugs Of Hindostan
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2026 | 7:25 AM

Share

సినిమా రంగంలో ప్రతీవారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య, స్టార్ కాస్ట్‌తో బరిలోకి దిగినప్పటికీ ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరుస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చినప్పటికీ, ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకునే చిత్రాలు కోకొల్లలు. అలాంటి కోవకే చెందుతుంది బాలీవుడ్‌లో తెరకెక్కిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై విడుదలైన సమయంలో భారీ అంచనాలు ఉండేవి. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రల్లో నటించారు. సుమారు రూ. 310 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.

సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) , గ్రాఫిక్స్ పరంగా ఎంతో ప్రయత్నించినప్పటికీ, కథలో , స్క్రీన్ ప్లేలో బలం లేకపోవడం వల్ల ప్రేక్షకులు దీనిని తిరస్కరించారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దేశవ్యాప్తంగా కేవలం రూ. 151.30 కోట్లు మాత్రమే వసూలు చేసి బారీ నష్టాలను చవిచూసింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పెద్ద డిజాస్టర్ చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచింది.

అయితే థియేటర్లలో తీవ్ర నిరాశపరిచిన ఈ చిత్రం, ఆ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చినప్పుడు ఊహించని రీతిలో ట్రెండ్ అయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూడటం విశేషం. థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ, ఓటీటీ ప్రియులను ఈ భారీ యాక్షన్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోవడంలో సఫలమైంది. అటు ఈ చిత్రం యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూడొచ్చు.

Follow Us