Allu Arjun: బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పిన డైరెక్టర్ సుకుమార్.. ‘పుష్ప’ నుంచి మరో ఫోటో రిలీజ్..

తాజాగా ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఉగ్రగంగమ్మ రూపంలో బన్నీ కనిపిస్తోన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో ఆయనకు సినీ ప్రముఖులు.. అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు.

Allu Arjun: బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పిన డైరెక్టర్ సుకుమార్.. 'పుష్ప' నుంచి మరో ఫోటో రిలీజ్..
Allu Arjun, Sukumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 08, 2023 | 7:01 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీలో స్మగ్లర్ పుష్పరాజ్‎గా పక్కా ఊర మాస్ లుక్‏లో రఫ్పాడించారు బన్నీ. ఈ సినిమా సౌత్ ప్రేక్షకులకంటే.. నార్త్ ఆడియన్స్‏ను ఎక్కువగా ఆకట్టుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడమే కాకుండా.. బన్నీ క్రేజ్ మార్చేసింది. దీంతో ఈ మూవీ సిక్వెల్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప సినిమాకు సిక్వెల్‏గా రాబోతున్న పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఉగ్రగంగమ్మ రూపంలో బన్నీ కనిపిస్తోన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో ఆయనకు సినీ ప్రముఖులు.. అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు.

ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ బన్నీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ వేదికగా పుష్ప సెట్ నుంచి అల్లు అర్జున్ ఫోటో షేర్ చేస్తూ… “పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ.. ప్రసుతం పుష్పరాజ్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ మెప్పుతో నువ్వుతో దూసుకెళ్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం నువ్వు నా ఆర్యగానే ఎప్పటికీ మదిలో స్వీట్ మెమొరీగా నిలిచిపోతావు. ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సుకుమార్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

గత కొద్ది రోజులుగా పుష్ప 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. ప్రతినాయకుడిగా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

View this post on Instagram

A post shared by Sukumar B (@aryasukku)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.