Punch Prasad: మరోసారి ఆసుపత్రిలో చేరిన పంచ్ ప్రసాద్.. నడచేందుకు ఇబ్బందిపడుతున్న జబర్దస్త్ కమెడియన్..
ఇటీవల తిరిగి జబర్ధస్త్ వేదికపై కనిపించారు పంచ్ ప్రసాద్. ఆయనకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంంబధించిన వీడియోను విడుదల చేశారు.
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యకు అనేక ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం ఒక్కోసారి బాగుంటే.. మరోసారి తీవ్రమైన నొప్పితో అల్లాడిపోతున్నారు. ఆయన తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్స్ సూచించారు. లేదంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందట. దీంతో ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. ముందు నుంచి ఆయనకు తోడుగా తన భార్య తోడుంటున్నారు. పంచ్ ప్రసాద్‌కు దగ్గరుండి సేవలు చేస్తూ… ఆయనను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇటీవల తిరిగి జబర్ధస్త్ వేదికపై కనిపించారు పంచ్ ప్రసాద్. ఆయనకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంంబధించిన వీడియోను విడుదల చేశారు.
అందులో ఓ ఇంజెక్షన్ కోసం ప్రసాద్ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలో పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. “ఇంజక్షన్ కోసం వచ్చాం.. ఆయన కుడిచేతిపై ఇప్పటివరకు 50 ఇంజెక్షన్స్ చేశారు. డయాలసిస్ నొప్పి తట్టుకోలేము. డయాలసిస్ తర్వతా క్లీడ్ ఇచ్చినప్పుడు కొంచెం బాగుంటుంది. ప్రసాద్ ఇంజెక్షన్స్ అంటే భయపడిపోతున్నాడు. అదికూడా ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి” అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ నడవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య తెలిపారు. ఇటీవలే తీవ్రమైన జ్వరం రావడంతో మరోసారి ఆసుపత్రిలో చేరారని… ఇప్పుడిప్పుడే ప్రసాద్ కోలుకుంటున్నారని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.