Bharateeyudu 2 : కమల్ భారతీయుడు2 సినిమా విషయంలో శంకర్ తీసుకున్న నిర్ణయం ఇదేనా..?
తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు కమల్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్..
కమల్ హాసన్ ఈ మధ్య విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన విక్రమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు కమల్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.. అయితే ఎప్పుడో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. కమల్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది.
అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 విషయంలో శంకర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. అయితే ఒక షెడ్యూల్ కమల్ సినిమా .. ఒక షెడ్యూల్ చరణ్ సినిమా షూట్ చేస్తున్నారు శంకర్.
అయితే రీసెంట్ గా భారతీయుడు షూటింగ్ కోసం తైవాన్. అయితే శంకర్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట. శంకర్ తన సినిమాలో యాక్షన్ సీన్స్, పాటల కోసం చాలా సమయం తీసుకుంటారు. కానీ భారతీయుడు 2 కోసం అలా కాకుండా స్పీడ్ పెంచి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారట. బడ్జెట్ గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. భారతీయుడు 2 చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా రామ్ చరణ్ సినిమాకు మాత్రం కావాల్సినంత టైం తీసుకుంటున్నారు శంకర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.