Srinu Vaitla: నాకు నేను తొవ్వుకున్న గొయ్యి ఆ సినిమా.. శ్రీను వైట్ల అలా అనేశాడేంటీ..!
అప్పట్లో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందమైన ప్రేమ కథలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించి మెప్పించారు శ్రీను వైట్ల. ఈ మధ్య కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్.
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైమెంట్స్‌తో పాటు పవర్ ఫుల్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శ్రీనువైట్ల. అప్పట్లో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందమైన ప్రేమ కథలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించి మెప్పించారు శ్రీను వైట్ల. ఈ మధ్య కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్.ఇక ఇప్పుడు విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీనువైట్ల. చాలా కాలం తర్వత శ్రీనువైట్ల విష్ణు మంచు తో సినిమా చేస్తున్న అని అనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఢీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.
ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
ఇదిలా ఉంటే ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు శ్రీనువైట్ల. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన లాస్ట్ మూవీ అమర్ అక్బర్ అంథోని. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు విశ్వం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శ్రీను వైట్ల మహేష్ బాబు ఆగడు సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా ఫ్లాప్ తన తప్పే అని అన్నారు. నిజానికి ఆగడు సినిమాకు అనుకున్న కథ వేరే.. కానీ ఆ కథకు నిర్మాతల నుంచి అనుకున్నంత బడ్జెట్ కుదర్లేదు. దాంతో కథ మార్చాల్సి వచ్చింది. పైగా దూకుడు సినిమాతర్వాత వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ సినిమా కోసం కష్టపడ్డాము కానీ ఆ అంచనాలను ఆగడు అందుకోలేకపోయింది. నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అది అని చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల.
ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి