Hyderabad: వంట గదిలో ఎలారా.! యజమానులు వచ్చి చూడగా లోపల బ్యాగుల్లో
శుభమా అని ఏదైనా ఇంట్లో కార్యం చేసుకుని, అతిథులను అందరిని పిలిచి.. వారు కడుపు నిండా భోజనం చేసి వెళ్లాలని అనుకుంటాం. పెద్ద మొత్తంలో వంటకాలు అవసరం పడతాయి కాబట్టి అందుకోసం వంట మనుషులను పెట్టుకుంటాం. కమ్మగా వండి పెట్టినందుకు మనకు సంతృప్తి, వాళ్లకూ ఓ ఆర్థిక అవసరం తీరుతుందని భావిస్తాం.

హైదరాబాద్ మహా నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఏదో ఫంక్షన్ హాళ్లలో వేడుకలు జరుగుతూనే ఉంటాయి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి మరీ వచ్చిన అతిథులు సంతృప్తిగా భోజనం చేసి వెళ్లాలని అనుకుంటాం. అలా ఈ మధ్యకాలంలో ఫంక్షన్లలో నాన్‌వెజ్ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి అతిథులు తినే భోజనం కమ్మగా వండి పెట్టాలంటే దాని కోసం వంట మనుషులు కావాలిగా.. అలా పని కోసం పురమాయించిన వాళ్లకు కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసి వారికి అప్పగించి మనం ఫంక్షన్ హడావిడిలో పడిపోతుంటాం. వంట చేయడానికి వచ్చినవారు తెగ హడావిడి చేసేస్తూ అలా చేయాలి.. ఇది ఇలా రుచిగా రావాలి.. అందులో ఉప్పు తక్కువ ఉండకూడదు. ఇందులో చింతపండు ఎక్కువ ఉండకూడదని వాళ్ల కింద పని చేసేవాళ్లకు ఆదేశాలు జారీ చేస్తుంటారు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
పోనీలే.! మనం అప్పజెప్పిన పనిని ఇంత నిబద్ధతగా చేస్తున్నారు కదా అని భావిస్తే.. వాళ్లేమో చేసేదంతా చేస్తూనే మరోవైపు మన జేబుకే కన్నం పెట్టే పనికి పూనుకుంటున్నారు. వంటలు చేయడం పూర్తి చేసి.. మళ్లీ సాయంత్రం ఫంక్షన్ సమయంలో ముస్తాబై వస్తామని చెప్పి ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు. అదిగో అలా దొరికిన ఆ కాస్త తక్కువ సమయంలోనే వంట మనుషులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖరీదైన వస్తువులతో పాటు మాంసం ఇతర వస్తువులు కూడా దొంగచాటుగా తీసుకెళ్లిపోతున్నారు. ఇదెక్కడి పైత్యంరా బాబోయ్ అని మనం ఆశ్చర్యపోయేలా చేస్తున్న సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్ హాల్‌లో వంట మనుషులు సుమారు 50 కేజీల చికెన్ మాంసాన్ని దాచిపెట్టి.. ఆపై ఇంటికి వెళ్లి ఇప్పుడే వస్తామని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ క్రమంలో అంతకు ముందే చాలా పకడ్బందీగా దాచిపెట్టుకున్న మాంసం దొంగచాటుగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుండగా.. ఫంక్షన్ నిర్వాహకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంకేముంది.. వంట మనుషులు గుట్టు రట్టయింది. అతిగా ఆశపడి వచ్చిన అవకాశాన్ని కూడా కాలదన్నుకొని చేసిన నిర్వాకం బట్టబయలైంది. ఇలా చేయడం వల్ల ఫంక్షన్లలో వండిన ఆహరం తక్కువ పడుతుండడంతో పాటు వచ్చిన అతిథుల మధ్యలో పరువు కూడా పోయే అవకాశం ఉంది. అందుకే ఇలాంటివారికి బుద్ధి చెప్పాలని ఆ ఫంక్షన్ నిర్వాహకులు ఆ బాగోతాన్ని వీడియో తీసి అందరికీ తెలిసేలా చేశారు. మీరు కూడా ఫంక్షన్లు చేస్తున్న సమయంలో ఎన్ని వస్తువులు తెప్పిస్తున్నారు?.. అసలు వంట మనుషులు ఎలాంటి వాళ్లు?.. ఎంత వండుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలని వీడియో ద్వారా తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




