AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saree Teaser: ప్రేమ మరీ ఎక్కువైతే భయమే.. ఆర్జీవీ ‘శారీ’ టీజర్ రిలీజ్..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈసినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. నార్మల్ గా చీరలోనే తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. ఆ ప్రేమ ఎక్కువై చివరకు సైకోగా ఎలా మారాడు అన్నది ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

Saree Teaser: ప్రేమ మరీ ఎక్కువైతే భయమే.. ఆర్జీవీ 'శారీ' టీజర్ రిలీజ్..
Saree
Rajitha Chanti
|

Updated on: Sep 15, 2024 | 8:20 PM

Share

సెన్సెషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటేస్ట్ మూవీ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. ప్రేమ చంపేస్తుంది.. అదే ప్రేమ ఎక్కువైతే భయమే.. ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ బిజినెస్ మెన్ రవివర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా శారీ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈసినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. నార్మల్ గా చీరలోనే తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. ఆ ప్రేమ ఎక్కువై చివరకు సైకోగా ఎలా మారాడు అన్నది ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

చీరలో ఉన్న అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి ఆమె ప్రేమలో పడి ఎంత ప్రమాదకరంగా మారాడు అనేది ఈ టీజర్ లో చూపించారు. ఇందులో అబ్బాయిగా సత్య యాదు నటించగా.. అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తుంది. నిజానికి ఆరాధ్యకు ఇది మొదటి సినిమా. ఇన్నాళ్లు ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే గతేడాది ఆరాధ్యదేవి చీరలతో చేసిన వీడియోస్ చూసిన ఆర్జీవి.. ఆమెను వెతికిపెట్టమంటూ ట్విట్టర్ వేదికగా వరుస పోస్టులు చేశాడు.

ఆర్జీవీ వరుస పోస్టులతో నెటిజన్స్ ఆరాధ్యే దేవి గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. ఎట్టకేలకు ఆ అమ్మాయి ఇన్ స్టాతోపాటు కాంటాక్ట్ డీటెయిల్స్ కనుకున్నారు. ఇక ఆ అమ్మాయితోనే శారీ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఇక అప్పటి నుంచి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని కలిగించిన ఆర్జీవీ.. ఇప్పుడు శారీ టీజర్ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

శారీ టీజర్ చూసేయ్యండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్