AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇది కదా రైతుల పండుగ అంటే.! ఏకంగా రూ. 2 లక్షలు పెట్టి కొనేస్తున్నారోచ్.. డబ్బే డబ్బు

రికార్డు స్థాయి ధర.. టన్ను రెండు లక్షలు.. దరహాసంతో ఆ రైతు మెరిసిపోతున్నాడు. కాలర్ ఎగరేస్తున్నాడు. మొన్నటి వరకు ధరలు లేక దిగాలు పడిన అన్నదాత.. నేడు దరహాసంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆ వివరాలు ఏంటి.? ఇప్పుడు ఓ సారి ఈ స్టోరీలో లుక్కేయండి.

Andhra: ఇది కదా రైతుల పండుగ అంటే.! ఏకంగా రూ. 2 లక్షలు పెట్టి కొనేస్తున్నారోచ్.. డబ్బే డబ్బు
Pomogranate
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 21, 2026 | 7:45 AM

Share

దానిమ్మ పంటకు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. దానిమ్మ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. ఆయుర్వేదంలో కూడా దానిమ్మకు మంచి గుర్తింపు ఉంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు కొన్ని రకాల వ్యాధులను నియంత్రణలో పెడుతుంది అనేది ప్రచారం. అలాంటి దానిమ్మ పంటకు మూడు నెలల క్రితం ధర లేదు. టన్ను కేవలం రూ. 50 వేలు మాత్రమే పలికేది. ఇప్పుడు పరిస్థితి మారింది క్రమంగా ధర పెరుగుతూ వస్తుంది. ఎంతగా అంటే రికార్డులు దాటే స్థాయికి చేరుకుంది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో దిగుబడులు ఆలస్యం కావడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లుగా వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యతను బట్టి దానిమ్మ పంటను టన్ను రూ. 2 లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడు నెలల క్రితం టన్ను రూ. 50 వేలు ఉన్న దానిమ్మ నెల రోజుల క్రితం రూ. లక్ష నుంచి రూ. లక్ష పదివేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం రూ. రెండు లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15500 హెక్టార్లలో ఈ దానిమ్మ పంట సాగు చేస్తున్నారు రైతులు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

మెజారిటీ శాతం రాయలసీమ జిల్లాలలోనే పండిస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో ఈ దానిమ్మ సాగు అత్యధికంగా ఉంది. స్థానికంగా ఫ్రూట్ కవర్స్, ప్లాంట్ కవర్స్ విధానంతో దానిమ్మ పండ్ల నాణ్యత పెరిగిందని అధికారులు చెబుతున్నారు, అయితే ఈ ధర ఎంతవరకు ఉంటుంది. కంటిన్యూ అవుతుందా.. లేదా తగ్గుతుందా.. అనేదానిపై దానిమ్మ రైతులలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తమ పంటలు అమ్ముకుంటున్న దానిమ్మ రైతుల కష్టాలు దాదాపు తీరినట్లే.

ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!