AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున ‘అన్న’ అని పిలుస్తారు.. మేకప్ మ్యాన్ చెప్పిన ఆసక్తికర విషయాలు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మేకప్ మ్యాన్ చంద్ర.. నాగార్జున, హరికృష్ణ మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని, సీతారామరాజు కోసం చేసిన ప్రత్యేక మేకప్ టెక్నిక్‌ను వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి. లేట్ ఎందుకు లుక్కేయండి.

Tollywood: ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు.. మేకప్ మ్యాన్ చెప్పిన ఆసక్తికర విషయాలు
Akkineni Nagarjuna
Ravi Kiran
|

Updated on: Jan 20, 2026 | 1:50 PM

Share

35 ఏళ్లుగా నటుడు నాగార్జున దగ్గర మేకప్ మ్యాన్‌గా పని చేసిన చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. నాగార్జున, హరికృష్ణ మధ్య రిలేషన్, కింగ్ నాగ్ కోపం గురించి ఓ ఆసక్తికర అంశాన్ని వివరించారు. అన్నమయ్య సినిమా కోసం నాగార్జున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని చంద్ర తెలిపారు. షూటింగ్‌కు సాధారణంగా వచ్చి వెళ్ళేవారని, అయితే అన్నమయ్య పాత్ర కోసం నాన్-వెజ్ ఆహారాన్ని మానేశారని చెప్పారు. దర్శకుడు రాఘవేంద్రరావు తన భక్తి చిత్రాలైన రామదాసు, శిరిడీ సాయిబాబా, అన్నమయ్య లాంటి సినిమాల సెట్స్‌లో నాన్-వెజ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేవారు కాదని, ఈ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉండేవారని చంద్ర వెల్లడించారు. దాన వీర శూర కర్ణ చిత్రంలో నటుడు హరికృష్ణ అర్జునుడి వేషం వేసినప్పుడు.. ఆయనకు, తనకు మధ్య 16 సంవత్సరాల తేడా ఉంది. అప్పట్లో షూటింగ్ లొకేషన్లలో జనరేటర్లు తరచుగా వేడెక్కి ఆగిపోయేవని, అప్పుడు హరికృష్ణ స్వయంగా వాటిని రిపేర్ చేసేవారని వివరించారు. అప్పట్లో చిన్న వయసు కాబట్టి హరికృష్ణతో భయం లేకుండా సన్నిహితంగా ఉండేవాడినని, ఆయన కూడా తనను ప్రేమగా ‘ఇడ్లీ తిన్నావా?’ అని పలకరించేవారని చంద్ర తెలిపారు. నాగార్జున.. వెంకట్‌తో సహా ఎవరినీ అన్న అని పిలవరని, కానీ హరికృష్ణను మాత్రమే అన్న అని సంబోధించేవారని చంద్ర వెల్లడించారు. వారిద్దరి మధ్య తెలియని ప్రేమ, అభిమానం ఉండేవని, హరికృష్ణ తరచుగా నాగార్జున గురించి తనను అడిగేవారని చెప్పారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

మేకప్ మ్యాన్ చంద్ర నాగార్జునతో కలిసి పనిచేయడం మానేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. రగడ షూటింగ్ సమయంలో తల్లి ఆరోగ్యం క్షీణించడం, సెట్‌లో జరిగిన ఒక గొడవ కారణంగా నాగార్జునకు చెప్పకుండా అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చేశానన్నారు. తన ప్రవర్తన వల్ల ఏర్పడిన గిల్టీనెస్ తోనే ఆ నిర్ణయం తీసుకున్నానని, అయితే ప్రస్తుతం తమ బంధం బాగుందని తెలిపారు. రగడ సినిమా షూటింగ్ బాదామిలో జరుగుతున్నప్పుడు, చంద్ర తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె 96 ఏళ్ల వయస్సులో మెదడు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇంట్లో చాలా సమస్యలు ఎదురయ్యేవని, ఇది తనకు మానసిక క్షోభ కలిగించిందని తెలిపారు. అదే సమయంలో షూటింగ్ సెట్‌లో ఒక వ్యక్తితో చంద్రకు గొడవ జరిగింది. ఈ రెండు కారణాలతో చంద్ర అర్ధరాత్రి 11:30 గంటలకు నాగార్జునకు చెప్పకుండానే బాదామి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం, చంద్ర ఒకరిని కొట్టారని తెలిసి నాగార్జున బాధపడ్డారని, అయితే చంద్ర వెళ్లిపోయారని తెలిసిన తర్వాత మరింత నిరాశ చెందారని తెలిపారు. తన చర్య వల్ల నాగార్జున తనపై నమ్మకం కోల్పోయినందుకు చంద్రలో గిల్ట్ ఏర్పడింది. ఇదే ఆఖరికి నాగార్జునతో కలిసి పనిచేయడాన్ని ఆపేయాలనే నిర్ణయానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండ్ హాఫ్‌ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండ్ హాఫ్‌ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
అక్కడ వింత చట్టం చూసి వణికిపోతున్న ప్రజలు..
అక్కడ వింత చట్టం చూసి వణికిపోతున్న ప్రజలు..
చెత్త ఓటమితో కోచ్ పోస్ట్ నుంచి ఔట్.. గంభీర్ ప్లేస్‌లో ఎవరంటే?
చెత్త ఓటమితో కోచ్ పోస్ట్ నుంచి ఔట్.. గంభీర్ ప్లేస్‌లో ఎవరంటే?
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్