AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moddu Seenu: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!

రిటైర్డ్ అడిషినల్ ఎస్పీ శరత్ బాబు తన కెరీర్‌లోని కీలక కేసుల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నరసరావుపేటలో మొద్దు శీను ఎదుగుదల, ఫ్యాక్షన్ రాజకీయాలు, బాంబుల సంస్కృతిని ఎలా కంట్రోల్‌లోకి తెచ్చారో వివరించారు. మరి పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీను గురించి ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందామా..

Moddu Seenu: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!
Moddu Seenu
Ravi Kiran
|

Updated on: Jan 20, 2026 | 12:37 PM

Share

రిటైర్డ్ అడిషినల్ పోలీసు సూపరింటెండెంట్ శరత్ బాబు గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పోలీసు కెరీర్‌లోని అత్యంత కీలకమైన, సవాలుతో కూడుకున్న కేసుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా పరిటాల రవి కేసు, మొద్దు శీను కేసు, నరసరావుపేటలో ఫ్యాక్షన్ కంట్రోల్ విషయాల్లో తాను తీసుకున్న చర్యల గురించి వివరించారు. నరసరావుపేట, నకిరేకల్ ప్రాంతాల్లో రెండేళ్లపాటు విధులు నిర్వహించిన కాలంలో, అప్పట్లో అంతగా తెలియని జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను అనే వ్యక్తి అప్పుడప్పుడే నేర ప్రపంచంలో ఎదుగుతున్నాడని శరత్ బాబు వెల్లడించారు. తాను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మొద్దు శీను ఎస్.ఎస్.ఎన్. కాలేజ్, రెడ్డి కాలేజ్ లాంటి విద్యాసంస్థల్లో విద్యార్థిగా, లేదా డ్రాపౌట్‌గా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

అప్పటికే రౌడీయిజంపై కొంత ఆసక్తి ఉన్న కొద్దిమందిలో మొద్దు శీను ఒకడని, ఆ సమయంలో అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. విద్యాభ్యాస సమయంలో మొద్దు శీనుకు పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కావాలనే కోరిక ఉండేదని, అయితే పరిస్థితుల ప్రభావంతో అతను నేరాల వైపు వెళ్లాడని శరత్ బాబు అన్నారు. నకిరేకల్‌లో ఒక వైన్ షాపు వద్ద కాల్పులు జరిపి ఓనర్ హత్య జరిగిన ఘటన తన పదవీకాలం తర్వాత చోటుచేసుకుందని ఆయన స్పష్టం చేశారు. పరిటాల రవి హత్య కేసు తర్వాతే మొద్దు శీను పేరు వెలుగులోకి వచ్చిందని, తాను పనిచేసిన సమయంలో తుపాకులతో కాల్పులు జరిపే స్థాయికి అతను ఎదగలేదని శరత్ బాబు పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి

నరసరావుపేటలో ప్రబలంగా ఉన్న “బాంబుల సంస్కృతి”ని నియంత్రించడం ఒక పెద్ద సవాలని శరత్ బాబు వివరించారు. ఈ సంస్కృతిని అదుపు చేయడానికి తాను నిరంతరం దాడులు నిర్వహించి, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నేరస్తులను పట్టుకున్నానని తెలిపారు. అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాద్ స్వస్థలం నరసరావుపేట కావడం, అక్కడ రాజకీయ ప్రత్యర్థుల మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవని శరత్ బాబు తెలిపారు. సాధారణంగా ఒక ఫంక్షన్‌కు ఒక రాజకీయ నాయకుడు వస్తే, ప్రత్యర్థి పార్టీ నాయకుడు రాడు. అయితే, తన పెళ్లి హైదరాబాద్‌లో జరిగినప్పుడు, అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాద్‌‌తో పాటు కాసు కృష్ణారెడ్డి కూడా హాజరు కావడం ఒక అరుదైన సంఘటన అని, ఇది తన నిష్పక్షపాత వైఖరికి నిదర్శనమని శరత్ బాబు వివరించారు. ఏదైనా సోదాలు నిర్వహించాలంటే కచ్చితమైన సమాచారం ఉండాలని, కేవలం ఊహాగానాలపై ఆధారపడి ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేయడం అసాధ్యమని ఆయన వివరించారు. నరసరావుపేట నుంచి గుంటూరు టౌన్‌కు బదిలీ అయ్యి, అక్కడ కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించానని శరత్ బాబు తెలిపారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..