పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’తో తులాభారం.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
పెద్దపల్లికి చెందిన కాసర్ల రాజు తన పెంపుడు కుక్క భైరవ తీవ్ర అనారోగ్యం నుండి కోలుకోవడంతో అరుదైన మొక్కు తీర్చుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకుని, కుక్క ఆరోగ్యంగా మారితే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తానని ప్రమాణం చేశారు. మొక్కు నెరవేరడంతో భైరవ బరువుకు సమానమైన బెల్లాన్ని తులాభారం వేసి సమర్పించారు. జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమను స్థానికులు అభినందించారు.

సహజం..నిలువెత్తు బంగారం ( బెల్లన్ని) మనుషుల కు ఇస్తారు. కోరిన, కోర్కెలు తీరితే సమ్మక్క కు ఇలా బెల్లం చెల్లించడం ఆనాయితీ.. అయితే.. తన పెంపుడు కుక్క కు కాసర్ల రాజు అనే వ్యక్తి నిలువెత్తు బంగారం ఇచ్చాడు. పెద్దపల్లి పట్టణంలో శ్రీమాతా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భైరవకు గత నెల సుస్తీ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమి తినకుండా అస్వస్థకు గురైంది. ఆ సమయంలో అతనికి ఏమి తోచక సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నాడు.
కుక్క ఆరోగ్యం కుదుట పడితే జాతర సమయంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తానని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నాడు. మొక్కిన వెంటనే భైరవకు ఆరోగ్యం కుదుటపడింది. మొక్కు నెరవేరింది.. కాబట్టే కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. పెంపుడు శునకానికి తులాభారం జరిపిస్తుండగా, స్థానికులు ఆసక్తి గా తిలకించారు. కుక్క కూడా ఇప్పుడు చాలా హుషారుగా ఉంది. మూగ జీవాల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




