AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు భారీ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు విడుదల.. మీకు వచ్చాయా..?

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రతీవారం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఇల్లు నిర్మించుకుంటున్నవారికి పనులను బట్టి ఆలస్యం చేయకుండా అకౌంట్లోకి డబ్బులు వేస్తోంది. అందులో భాగంగా సోమవారం, మంగళవారం రికార్డ్ స్థాయిలో లబ్దిదారులకు తాజాగా నిధులు విడుదల చేసింది.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు భారీ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు విడుదల.. మీకు వచ్చాయా..?
Indiramma Houses
Venkatrao Lella
|

Updated on: Jan 21, 2026 | 7:59 AM

Share

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు లబ్దిదారుల అకౌంట్లో నేరుగా వీటిని జమ చేసింది. ఏకంగా రాష్ట్రంలోని 23 వేల మంది అకౌంట్లోకి డబ్బులు వేసింది. వీరి అకౌంట్లోకి దాదాపు రూ.262.51 కోట్లను తాజాగా విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేరోజు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడం రికార్డ్‌గా చెబుతున్నారు. ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో ఒకేరోజు నిధులు విడుదల చేయలేదు. ఆధార్ అనుసంధానం ద్వారా వీటిని లబ్దిదారుల అకౌంట్లోకి విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్నవారు, నిర్మించుకుంటున్నవారికి రూ.4,351 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది.

రెండు రోజుల్లో రికార్డ్

సోమవారం కొంతమంది లబ్దిదారులకు అందించగా.. మంగళవారం మరికొంతమంది అకౌంట్లో నిధులు జమ చేసింది. ఈ రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో రూ.262.51 కోట్లు అందించింది. ఆధార్ నెంబర్ ఆధారంగా పారదర్శకంగా చెల్లింపులు చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. రెండు రోజుల్లో సుమారు 23 వేల మందికి లబ్ది చేకూర్చినట్లు స్పష్టం చేసింది. ప్రతీ సోమవారం లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నామని, దీని వల్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చేస్తున్నట్లు తెలిపింది. జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లను పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం నిజమైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనం జరిగేలా చేస్తున్నారు.

మార్చి నుంచి కొత్త ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా ప్రభుత్వం శుభవార్త అందించింది. మార్చి నుంచి రెండో విడతలో భాగంగా కొత్త ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. విడతల వారీగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తోంది. దీంతో కొత్త ఇళ్లు ఎప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో వారికి ఊరట కలిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిల్లో 1.25 లక్షల ఇళ్లు త్వరలోనే పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహప్రదేశాలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం కొన్ని ఇల్లు బేస్‌మెంట్ స్థాయి నుంచి గోడల దశ వరకు చేరుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
'ధురంధర్ 2' టీజర్ వచ్చేస్తోంది..1 నిమిషం 48 సెకన్ల పాటు భీభత్సమే
'ధురంధర్ 2' టీజర్ వచ్చేస్తోంది..1 నిమిషం 48 సెకన్ల పాటు భీభత్సమే
6 సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్..
6 సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్..
ఏపీలో మార్చి నుంచి కొత్త కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..
ఏపీలో మార్చి నుంచి కొత్త కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..