AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn transit: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్

Saturn transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాశులు, నక్షత్రాలను మారుస్తూ సంచారం చేస్తుంటాయి. ఈ గ్రహ సంచారాలు ఆయా రాశులు, నక్షత్రాలపై అనుకూల-ప్రతికూల ప్రభావాలను చూపుతాయని విశ్వసిస్తారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాదిలోకి ప్రవేశించాడు. ఈ అరుదైన సంచారం నాలుగు నెలలపాటు కొనసాగనుంది. ఈ సంచారం 12 రాశులపై ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Saturn transit: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
Saturn transit 2026
Rajashekher G
|

Updated on: Jan 21, 2026 | 8:14 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ నక్షత్రాలను, రాశులను మార్చుకుంటూ సంచారం చేస్తుంటాయి. ఈ సంచారం ఆయా రాశులు, నక్షత్రాలపై మంచి, చెడు ప్రభావాలు చూపుతాయి. మానవ జీవితం, వృత్తి, ఆరోగ్యం, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. తాజాగా, కర్మ దేవుడైన శని సంచారం ప్రత్యేకంగా సాగుతోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాది నక్షత్రానికి సంచారం చేశాడు. నాలుగు నెలలపాటు ఈ ప్రత్యేకమైన సంచారం కొనసాగనుంది. జనవరి 20 నుంచి మే 17 వరకు శని ఉత్తరాది నక్షత్రంలో సంచరించడం వల్ల 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మేషరాశి ఈ రాశి వారికి శని సంచారం కష్టకాలం అవుతుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఓపిక చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఏప్రిల్ తర్వాత కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం, కుటుంబ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
  2. వృషభ రాశి శనిసంచారం వల్ల వృషభ రాశివారికి చాలా లాభపడతారు. ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, వ్యాపార లాభాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక కెరీర్ ఆందోళనలు తొలగిపోతాయి. భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటారు.
  3. మిథునరాశి శని సంచారంతో మిథున రాశివారికి గౌరవం, హోదా పెరుగుతాయి. కొత్త బాధ్యతలు గుర్తింపును పెంచుతాయి. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి.
  4. కర్కాటక రాశి ఈ రాశివారికి శని సంచారంతో భావోద్వేగ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పు లేదా స్థాన చలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై ముఖ్యంగా నిద్ర, జీర్ణక్రియపై శ్రద్ధ చూపడం ముఖ్యం.
  5. సింహరాశి శని సంచారంతో సింహరాశి వారు కష్టపడితే విజయం సాధిస్తారు. అందుకే వీరు కష్టపడి పనిచేయడం అవసరం. ఉన్నతాధికారులతో సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తమ ఖ్యాతిని పెంచుకుంటారు.
  6. కన్యారాశి శని సంచారం కన్యారాశి వారికి శాంతి, స్థిరత్వాన్ని తెస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి. పదోన్నతి లేదా బాధ్యతాయుతమైన పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతి పెరుగుతుంది.
  7. తులారాశి తులా రాశి వారికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ, శని గ్రహం మంచి ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. భాగస్వామ్యం, చట్టపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం.
  8. వృశ్చికరాశి వృశ్చికరాశి వారికి ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. శని సంచారం కారణంగా ఖర్చులు పెరగవచ్చు. పనిలో మార్పులు సంభవిస్తాయి. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు మానసిక బలాన్ని పెంచుతాయి.
  9. ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వని సంచారం నిర్ణయాత్మకంగా ఉంటుంది. జీవితంలో తొలగిపోతుంది. కెరీర్ కొత్త దిశలో వెళుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ సమయంలో ప్రారంభించిన పని దీర్ఘకాలిక ప్రయోజనాలు తెస్తుంది.
  10. మకర రాశి శని సంచారంతో మకర రాశి వారికి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కెరీర్ వృద్ధి, ఆర్థిక లాభాలు, సామాజిక ప్రతిష్ఠ పెరుగుతాయి.
  11. కుంభ రాశి శని సంచారంతో కుంభరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఇందులో కొంత ఆలస్యం జరగవచ్చు. కెరీర్ మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం, ముఖ్యంగా మీ ఎముకలు, కీళ్ల పట్ల శ్రద్ధ వహించండి.
  12. మీనరాశి శని సంచారంతో మీన రాశి వారిలో ఆత్మ విశ్వాసం పెంచుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి ఉంటుంది. కెరీర్ స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. సృజనాత్మక, ఆధ్యాత్మిక రంగాలలో పాల్గొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)

Follow Us
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?