కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటున్న కుర్రభామ రితికా నాయక్ 

Rajeev 

21 January 2026

తెలుగు తెరపై అందం అభినయంతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో రితికా నాయక్ ఒకరు. ఈ బ్యూటీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా నాయక్.. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది.

ఇటీవల మిరాయ్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగుతుంది. 

అలాగే ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా.. వరుణ్ తేజ్ జోడిగా నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది ఈ అమ్మడు.