Ram Gopal Varma: తెలివితక్కువ వారే పెళ్లి చేసుకుంటారు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్స్..

సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నేట్లు తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీ కాంత్

Ram Gopal Varma: తెలివితక్కువ వారే పెళ్లి చేసుకుంటారు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్స్..
Ram Gopal Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2022 | 1:49 PM

సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నేట్లు తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తే ఐశ్వర్య తెలిపారు. అధికారికంగా తామిద్దరం విడిపోతున్నామంటూ సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో వీరిద్దరూ తమ ట్విట్టర్ ఖాతాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ధనుష్, రజినీ అభిమానులు షాకయ్యారు. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీ కపుల్స్ విడిపోతున్నట్లు ప్రకటించడం సర్వ సాధారణంగా మారిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మనస్పర్థల కారణంగా ఎప్పుడు ఏ జంట విడాకుల ప్రకటన ఇవ్వబోతున్నారనేది ఊహించలేకపోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలలో ఇండస్ట్రీలలో సెలబ్రెటీ కపూల్స్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంటలు విడిపోవడం ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో సెలబ్రెటీలు జంటలు విడిపోవడం పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు.

పెళ్లి అనేది పెద్ద ప్రమాదం అని యువత గుర్తించడానికి స్టార్ విడాకులు ట్రెండ్ సెట్టర్స్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఓపెన్ అయ్యారు. ప్రేమ హత్యకు కారణమే పెళ్లి.. మ్యారేజ్ అనే జైలుకు వెళ్లకుండా ప్రేమించుకుంటూ ఉండడమే ఆనంద రహస్యం అంటూ వరుస ట్వీట్స్ చేశారు. వివాహం చేసుకున్న తర్వాత 2, 3 రోజులే ప్రేమ ఉంటుంది.. స్మార్ట్ పీపుల్స్ ప్రేమిస్తారు. తెలివితక్కువ వారు పెళ్లి చేసుకుంటారు అంటూ ట్వీట్స్ చేశారు. పెళ్లి గురించి వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి.మరోవైపు వర్మ చేసిన ట్వీట్స్ కు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్స్.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..