Anasuya Bharadwaj : నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ.. ఇంతకు అతడు ఏమడిగాడంటే..
బుల్లితెర బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ఈ అమ్మడు క్రేజ్ అంతా ఇంతా కాదు. టీవీ షోలతోనే కాదు సినిమాలతోనూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Anasuya Bharadwaj : బుల్లితెర బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ఈ అమ్మడు క్రేజ్ అంతా ఇంతా కాదు. టీవీ షోలతోనే కాదు సినిమాలతోనూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. రంగస్థలం సినిమా నుంచి అనసూయ క్రేజ్ మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి అలరించింది. రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయిణిగా నటించి ఆకట్టుకుంది అనసూయ. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ కు విపరీతమైన ఫాలోయింది ఉంది. తన సినిమా అప్డేట్స్ తోపాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానుల్లాతో ముచ్చటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా అనసూయ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించింది.
అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పి అదరగొట్టింది. గతంలో కూడా అనసూయ కు ఇలాంటి వెర్రి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పి నోరు మూయించి ఈ అమ్మడు. తాజా ఓ నెటిజన్.. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ప్రశ్నించగా.. ‘ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే.. అంటూ అనసూయ పేర్కొంది. దీనికి వెంటనే ఆ నెటిజన్.. ‘ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ చేసినట్టు కాదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు’ అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ రిప్లే ఇస్తూ అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా’ అంటూ గట్టిగానే బదులిచ్చింది అనసూయ.
మరిన్ని ఇక్కడ చదవండి :