Suriya’s Jai Bhim : సూర్య సినిమాకు దక్కింది మరో గౌరవం.. ఆస్కార్స్ అకాడమీలో జై భీమ్ సినిమా సీన్..
తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.
Suriya’s Jai Bhim : తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇక చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అయిన సూర్య ఇటీవలే రెండు సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వాటిలో సుధాకొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సూర్య. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే రీసెంట్ గా జై భీమ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. “నీ హద్దురా”, “జై భీమ్”. తమిళ్ మరియు తెలుగు భాషల్లో రెండు కూడా ఓటిటి లోనే రిలీజ్ అయ్యినా భారీ హిట్స్ గా నిలవడమే కాకుండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.
ఇదిలా ఉంటే జైభీమ్ సినిమా గురించి మరోసారి చర్చ జరుగుతుంది. “జై భీమ్” చిత్రం కోసం కూడా మళ్ళీ అంతర్జాతీయ సినిమా దగ్గర చర్చకు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. సినిమాలోని ఒక 12 నిమిషాల వరకు ఉండే కీలక సన్నివేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది. ఇక ఇప్పటివరకు ఏ తమిళ్ సినిమాకు ఈ గౌరవం దక్కలేదు. దాంతో సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం తమిళ్ సినిమాకు మాత్రమే కాదు ఇండియన్ సినిమా అంతటికీ కూడా గర్వ కారణమే అంటున్నారు సూర్య అభిమానులు.
మరిన్ని ఇక్కడ చదవండి :