Puri Jagannadh: ఆ రూమర్స్‏కు చెక్ పెట్టిన పూరి జగన్నాథ్.. భార్య పిల్లలతో సొంత గ్రామంలో హోమం..

హీరోలతోపాటు సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి, ఇడియట్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్. పూరి సినిమాల్లో హీరోయిజం మరింత స్పెషల్. అయితే ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న పూరి.. కొద్ది రోజులుగా డౌన్ అయిపోయారు. చాలా కాలంగా ఆయన ఒక్క హిట్టు కోసం చూస్తున్నారు.

Puri Jagannadh: ఆ రూమర్స్‏కు చెక్ పెట్టిన పూరి జగన్నాథ్.. భార్య పిల్లలతో సొంత గ్రామంలో హోమం..
Puri Jagannadh
Follow us

|

Updated on: May 10, 2023 | 8:05 PM

హీరోలకే కాదు.. డైరెక్టర్లకు కూడా యమ ఫాలోయింగ్ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు దర్శకులు తెరకెక్కించే సినిమాల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. హీరోలతోపాటు సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి, ఇడియట్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్. పూరి సినిమాల్లో హీరోయిజం మరింత స్పెషల్. అయితే ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న పూరి.. కొద్ది రోజులుగా డౌన్ అయిపోయారు. చాలా కాలంగా ఆయన ఒక్క హిట్టు కోసం చూస్తున్నారు. ఇక పూరి మంచి బ్లాక్ బస్టర్ హిట్ రూపొందిస్తే చూడాలని ఫ్యాన్స్ సైతం వెయిట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాంలోకి వచ్చిన పూరి.. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య లైగర్ సినిమాను తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా పూరికి తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ తర్వాత పూరి నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు.

అయితే పూరి సినిమాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ వార్తలలో నిలుస్తుంటారు. అప్పట్లో ఆయన భార్యతో విడిపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై పూరి తనయుడు ఆకాష్ క్లారిటీ ఇచ్చారు. అయినా.. పూరి ముంబైలోనే ఉంటున్నారని.. హైదరాబాద్ రావడంలేదని.. భార్య పిల్లలకు కూడా దూరంగా ఉంటున్నారని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలలో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ సైతం మరిన్ని అనుమానాలను తీసుకువచ్చాయి. తాజాగా చాలా రోజుల తర్వాత పూరి తన భార్య పిల్లలతో కలిసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పూరి జగన్నాథ్ 30వ పెళ్లి రోజు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తన సొంత ఊరు నర్సీపట్నంలో అన్నదమ్ములతో కలిసి కనిపించారు పూరి. తన భార్య లావణ్య, పిల్లలతో కలిసి ఓ హోమాన్ని ఆచరించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి. అందులో పూరి.. తన భార్య లావణ్య ఎంతో అన్యోన్యంగా కనిపించారు. దీంతో వీరిద్దరు విడిపోతున్నారంటూ వచ్చిన రూమర్స్ కు చెక్ పడింది.

బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి