AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదేం క్రేజ్ మావ.. థియేటర్లలో పెద్ద డిజాస్టర్.. కానీ 11 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్.. ఇప్పటికీ తెగ చూస్తున్నారు..

ప్రస్తుతం ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం కొత్త కొత్త చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఓ మూవీ తెగ వైరలవుతుంది. దాదాపు 11 ఏళ్లుగా ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..

Cinema : ఇదేం క్రేజ్ మావ.. థియేటర్లలో పెద్ద డిజాస్టర్.. కానీ 11 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్.. ఇప్పటికీ తెగ చూస్తున్నారు..
Kochadaiiyaan
Rajitha Chanti
|

Updated on: May 22, 2026 | 8:20 PM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమాల విజయాలు, రిజల్ట్ పూర్తిగా మారిపోయాయి. థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన కొన్ని చిత్రాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. కాలం గడిచినా క్రేజ్ తగ్గకుండా, కొన్ని సినిమాలు ఇన్నేళ్లయినా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ కోవకు చెందినదే ఒక విభిన్నమైన చిత్రం. థియేటర్ రన్ పరంగా డబుల్ డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, దాదాపు 11 ఏళ్లుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో చూద్దామా.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

సాధారణంగా ఏదైనా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోతే, దానికి థియేట్రికల్ రన్ ముగియగానే క్రేజ్ తగ్గిపోతుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం భిన్నమైన స్పందన లభించింది. కథలోని కంటెంట్, మేకింగ్ స్టైల్ , నటీనటుల ప్రదర్శన ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన వారంతా డిజిటల్ స్క్రీన్‌లపై ఎగబడి చూస్తుండటంతో, గత 11 సంవత్సరాలుగా ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలుస్తూ రికార్డు సృష్టిస్తోంది. ఆ సినిమా మరెదో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొచ్చాడియాన్: ది లెజెండ్. 2014లో విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ భాషలలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన అవతార్, టిన్ టిన్ లాంటి టెక్నాలజీని ఉపయోగించారు. నటులు మోషన్ క్యాప్చర్ సూట్స్ ధరించి నటించారు, వారి కదలికలు 3D యానిమేషన్‌గా మార్చారు. దాదాపు 95 కోట్ల నుంచి రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా ట్రెండ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Rajamouli : ఆ హీరో చాలా గొప్పోడు.. సినిమా కోసం తన జీవితాన్నే ఇచ్చేశాడు.. రాజమౌళి కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి.

Follow Us
అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సోలార్ ప్యానెళ్లు.. భారీగా కార్గో స్కామ్!
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సోలార్ ప్యానెళ్లు.. భారీగా కార్గో స్కామ్!
WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు..
WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు..
124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
15 లక్షలు తీసుకున్నాక బిగ్ బాస్ టీం నాతో ఏం చెప్పారంటే..
15 లక్షలు తీసుకున్నాక బిగ్ బాస్ టీం నాతో ఏం చెప్పారంటే..
రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.. చివరికి..!
రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.. చివరికి..!
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర
కొత్త బట్టల రంగు వెలిసిపోతోందా? ఈ చిట్కాలతో మెరుపును కాపాడుకోండి!
కొత్త బట్టల రంగు వెలిసిపోతోందా? ఈ చిట్కాలతో మెరుపును కాపాడుకోండి!
9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్..
9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్..
రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌!
రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌!