Hanuman Movie: ‘హనుమాన్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్ ఇక..
సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో విడుదలైన టీజర్ ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. టీజర్ లో చూపించిన విజువల్ గ్రాఫిక్స్ కు సినీ లవర్స్ ఫిదా అయిపోయారు. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ రావడం.. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈ సినిమాలో చూపించనుండడంతో మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా హనుమాన్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో విడుదలైన టీజర్ ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. టీజర్ లో చూపించిన విజువల్ గ్రాఫిక్స్ కు సినీ లవర్స్ ఫిదా అయిపోయారు. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ రావడం.. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈ సినిమాలో చూపించనుండడంతో మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. దీంతో మూవీ స్టోరీపై.. విజువల్ ట్రీట్ కోసం అడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ మూవీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేయగా.. మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నెట్టింట ప్రస్తావన వచ్చింది.
#HanuMan movie promotions will start from this #GaneshChaturthi 🙏🏽😊#Sankranthi2024
— Prasanth Varma (@PrasanthVarma) September 13, 2023
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఇప్పటికీ ప్రమోషన్స్ షూరు చేయలేదనే కామెంట్స్ వచ్చాయి. తాజాగా హనుమాన్ మూవీపై అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ వినాయక చవితి నుంచి మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు డైరెక్టర్. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కాబోతుందని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో వినాయక చవితి రోజున ఎలాంటి అప్డేట్ ఇవ్వనున్నాడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
I have spent 2 years of my life on this film and ready to spend another 6 months to give you nothing but the best! 🙏🏽#HANUMAN on JAN 12th 2024, SANKRANTHI@tejasajja123 @Niran_Reddy @Primeshowtweets#HanuManForSankranthi pic.twitter.com/YkBBR8TPv0
— Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023
ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా కనిపించనుండగా.. అమృత అయ్యార్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఇందులో వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జాంబీరెడ్డి తర్వాత తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై ఇప్పటికే బజ్ ఏర్పడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.