Krish Jagarlamudi: ఆ సీనియర్ హీరోతో క్రిష్ ‘అతడు అడవిని జయించాడు’ సినిమా.?
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. గమ్యం, వేదం లాంటి విభిన్నమైన కథలను తెరకెక్కించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు క్రిష్.

Krish Jagarlamudi: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. గమ్యం, వేదం లాంటి విభిన్నమైన కథలను తెరకెక్కించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు క్రిష్. ఆ తర్వాత దగ్గుబాటి హీరో రానాతో కలిసి కృష్ణం వందే జగద్గురుమ్ అనే సినిమా చేశారు. సినిమా కథ, కథనాలు మంచిగా ఉన్నా.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా.. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ వందోవ సినిమా గౌతమీ పుత్రశతకర్ణి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నరు క్రిష్. ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందిన కొండపోలం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. కరోనా సమయంలో కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు క్రిష్.
మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే పవన్ సినిమా తర్వాత క్రిష్ ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పవన్ సినిమా తర్వాత యంగ్ హీరోతో క్రిష్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా క్రిష్ ఒక సీనియర్ హీరోతో సినిమా చేయాలనీ చూస్తున్నారట. ఆ హీరో ఎవరోకాదు ..విక్టరీ వెంకటేష్. వెంకీ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నారట క్రిష్. ప్రస్తుతం వెంకీ ఎఫ్ 3, దృశ్యం 2సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే క్రిష్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. డాక్టర్ కేశవరెడ్డి రాసిన ‘అతడు అడవిని జయించాడు’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :