Megastar Chiranjeevi : వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే.. ఓకే చేసేయ్ అన్నాను : చిరంజీవి

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

Megastar Chiranjeevi : వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే.. ఓకే చేసేయ్ అన్నాను : చిరంజీవి
Chiru
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2021 | 11:21 AM

Megastar Chiranjeevi : ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న అయ్యింది. కొండపొలం అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఓ యువకుడు ఎంతో ఎత్తుకు ఎదగడమే కొండపొలం కథ. అతడు అడవితో ప్రేమలో పడతాడు. అడవిలాంటి అమ్మాయి ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఇది చాలా కొత్త కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.

ఈ సినిమా పై మెగాస్టార్ చిరంజీవి ప్రసంశలు కురిపించారు. సినిమా చూసిన చిరు. దర్శకుడు క్రిష్‌కు అలాగే మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమా ఒక థ్రిల్ కు గురిచేస్తుంది. వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే ఓకే చేశా .. సినిమాను అద్భుతంగా తీశారు. సినిమాలో అందమైన లవ్ స్టోరీ ఉంది. అలాగే ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనే మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అన్నారు మెగాస్టార్. అలాగే చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇక విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు క్రిష్. నా కెరీర్‌లో నేను ముందుకు సాగడానికి..అలాగే  పట్టుదలతో ఉండటానికి నాకు బలాన్ని ఇస్తుంది మీరే. మీరు చాలా అరుదైన వ్యక్తి , మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చిరంజీవి సార్ అంటూ రాసుకొచ్చారు క్రిష్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Maa Elections 2021: మా ఎన్నికలపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు.. ఆపండి ఈ నల్లా దగ్గర లొల్లి అంటూ..

Bigg Boss 5 Telugu: సన్నీకి హ్యాండ్ ఇచ్చిన లోబో.. రాజుగా యాంకర్ రవి.. కన్నీళ్లు పెట్టుకున్న హమీద..

Kavya Thapar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కవ్విస్తున్న కావ్య.. ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..