Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: అసలు గేమ్ మొదలు పెట్టిన షణ్ముఖ్.. గట్టిగానే క్లాస్ తీసుకున్న యాంకర్ రవి..

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గేమ్ షో ల్లో టాప్ టీఆర్పీ తో దూసుకుపోతున్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి.

Bigg Boss 5 Telugu: అసలు గేమ్ మొదలు పెట్టిన షణ్ముఖ్.. గట్టిగానే క్లాస్ తీసుకున్న యాంకర్ రవి..
Ravi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2021 | 8:46 AM

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గేమ్ షో ల్లో టాప్ టీఆర్పీతో దూసుకుపోతున్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇప్పటికే విజయవంతగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు సీజన్ 5ను కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఇక హౌస్ లో ఉన్నవాళ్లలో కెమెరాకు దూరంగా ఉంటున్నది ఎవరంటే షణ్ముఖ్ అనే చెప్పాలి.. ఈ కుర్రాడు హౌస్ లోకి వచ్చిన దాదాపు నాలుగు వారల  వరకు ఎక్కడ కనపడకుండా సైలెంట్ గా ఉన్నాడు. దాంతో నాగార్జున కూడా ‘అరేయ్ ఏంట్రా ఇది కాస్త కనపడరా’.. అంటూ నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి కాస్త యాక్టివ్ అయ్యాడు. అయితే సిరి -షణ్ముఖ్ కలిసి గేమ్ ఆడుతున్నారని హౌస్ నుంచి బయటకు వెళ్లిన వాళ్ళు ఆరోపించడంతో.. షణ్ముఖ్ తన గేమ్ తాను ఆడదామని ఫిక్స్ అయ్యాడు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో చరిత్ర సృష్టించాడు షణ్ముఖ్. అతడిని ఏకంగా ఎనిమిది మంది నామినేట్ చేశారు. హౌస్ లో ఉన్న 15మందిలో ఎనిమిది మంది షణ్ముఖ్ ను నామినేట్ చేశారు. ఇక ఇప్పుడు షణ్ముఖ్ అసలు గేమ్ మొదలు పెట్టాడు. ఈ వారం టాస్క్‌లో భాగంగా  అందరి కంటే ముందు ఇంట్లో నాణాలను దొంగతనం చేసి తన దగ్గర దాచుకున్నాడు. సిరి, జెస్సితో తనకు కావాల్సిన గేమ్ ఆడిస్తున్నాడు షణ్ముఖ్. దాంతో మరోసారి తన స్నేహితులతో కలిసి గేమ్ ఆడటంతో కొందరు అతడిని వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో రవి వార్ దిగాడు షణ్ముఖ్. రవి మాట్లాడుతూ.. నేనంటే నీకు అంత కోపం ఎందుకురా షణ్ముఖ్.. ఎవరి ఏం ఎక్కించినా ఎక్కించుకోకురా.. నాతో మాట్లాడరా అని షణ్ముఖ్‌తో అన్నాడు. దాంతో నాకు కోపం ఎందుకు? ఎవరు ఎక్కిస్తారు? అంటూ ఘాటుగానే ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్. అయితే ఆటలో అరటిపండులా.. మీ తమ్ముడు షణ్ముఖ్‌ని గేట్ బయటపెట్టు అని సలహా ఇచ్చాడు విశ్వ. మరి హౌస్‌లో షణ్ముఖ్ కు ఇంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అతడు కొనసాగుతాడా లేక ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తాడా చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi : వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే.. ఓకే చేసేయ్ అన్నాను : చిరంజీవి

Maa Elections 2021: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ అన్నారు..! ఆసక్తికర ట్వీట్ చేసిన అజయ్ భూపతి..

Maa Elections 2021: మా ఎన్నికలపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు.. ఆపండి ఈ నల్లా దగ్గర లొల్లి అంటూ..