Maa Elections 2021: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ అన్నారు..! ఆసక్తికర ట్వీట్ చేసిన అజయ్ భూపతి..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌,  ఎన్నికల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రక్తికట్టిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Maa Elections 2021: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ అన్నారు..! ఆసక్తికర ట్వీట్ చేసిన అజయ్ భూపతి..
Ajay Bhupathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2021 | 7:12 AM

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌,  ఎన్నికల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రక్తికట్టిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆదివారం అక్టోబర్‌ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలలో నువ్వా నేనా అన్నట్లు రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. దీంతో ‘మా’ ఎన్నికలపై ఎవరేమి స్పందించినా సరే అది కాస్త సంచలనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి చేసిన సరికొత్త ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఓ దర్శకుడితో మాట్లాడానని.. ‘మా’ ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానల్‌ సభ్యులకు ఓటు వేసిన వారికే తదుపరి సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆ దర్శకుడు చెప్పినట్లు అజయ్‌ భూపతి పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు, అక్టోబర్‌ 10న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఓ వైపు నుంచి ప్రకాశ్‌రాజ్‌, మరోవైపు నుంచి మంచువిష్ణు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు.  ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమమే ప్రధాన థ్యేయంగా ఈ రెండు ప్యానల్స్‌ బరిలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ముందుగా మంచు విష్ణు తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Maa Elections 2021: మా ఎన్నికలపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు.. ఆపండి ఈ నల్లా దగ్గర లొల్లి అంటూ..

Bigg Boss 5 Telugu: సన్నీకి హ్యాండ్ ఇచ్చిన లోబో.. రాజుగా యాంకర్ రవి.. కన్నీళ్లు పెట్టుకున్న హమీద..

Kavya Thapar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కవ్విస్తున్న కావ్య.. ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..