AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సన్నీకి హ్యాండ్ ఇచ్చిన లోబో.. రాజుగా యాంకర్ రవి.. కన్నీళ్లు పెట్టుకున్న హమీద..

బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇక నిన్నటితో 33ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ 5. ఇక నలుగురు ఇంటిసభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు హౌస్ లో 15మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

Bigg Boss 5 Telugu: సన్నీకి హ్యాండ్ ఇచ్చిన లోబో.. రాజుగా యాంకర్ రవి.. కన్నీళ్లు పెట్టుకున్న హమీద..
Bigg Boss
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2021 | 12:58 PM

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇక నిన్నటితో 33ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ 5. ఇక నలుగురు ఇంటి సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు హౌస్‌లో 15మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక హౌస్‌‌‌లో రకరకాల టాస్క్‌లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌ను నానా తిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే  ‘రాజ్యానికి ఒక్కరే రాజు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కోసం రవి, సన్నీలు గట్టిగా ప్రయత్నించారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అనేంతలా పోటీజరిగింది. ఇక ఈ టాస్క్‌లో ఎవరు తమ వైపు ఉన్నారు.. ఎవరు వెన్నుపోటు పొడిచారో తెలిసిపోయింది. ఈ క్రమంలో సన్నీ టీమ్ లో ఉన్న లోబో.. రవి టీమ్‌లోకి మారిపోయాడు. ఇక ఈ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారన్నది తెలిసిపోయింది.

సన్నీ దగ్గర షణ్ముఖ్- మానస్- జెస్సీ- ప్రియాంక- సిరి- కాజల్‌లు ఉండగా.. రవి టీమ్ లో విశ్వ- లోబో- శ్రీరామ్- హమీదా- ఆనీ- ప్రియ- శ్వేతలు ఉన్నారు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగిన రాజుగా యాంకర్ రవి విన్నర్‌గా నిలిచాడు. దీంతో మొదటి కెప్టెన్ పోటీదారుడిగా అర్హత సాధించాడు రవి. ఆ తరువాత రవికి పట్టాభిషేకం నిర్వహించారు. ఇక రవి టీంలో ఉన్న ప్రియ- హమీదాలు కెప్టెన్సీ పోటీదారుల విషయంలో చర్చించుకున్నారు. హమీదా తనని ఏ కారణం లేకుండా నామినేట్ చేసిందని ప్రియా ఆరోపించింది.. అంతే కాదు మా ఇద్దరికీ సమన్వయం లేదు.. అందుకే హమీదా కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటానంటే రవి టీంకి నేను సపోర్ట్ చేయనని తెగేసి చెప్పింది ప్రియ. దాంతో హమీద  కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియ దగ్గరకు వచ్చి సారీ చెప్పింది హమీద.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kavya Thapar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కవ్విస్తున్న కావ్య.. ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..

Big News Big Debate: ‘మా’..యుద్ధంలో పెద్దలు ఎటు?.. కీలక విషయాలు వెల్లడించిన మురళి మోహన్

Childhood Photo: జయా బచ్చన్ చేతిలో ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో గుర్తు పట్టారా..!