Big News Big Debate: ‘మా’..యుద్ధంలో పెద్దలు ఎటు?.. కీలక విషయాలు వెల్లడించిన మురళి మోహన్
సినిమా ఇండస్ట్రీలో వీరయుద్ధాలు నడుస్తున్నాయి. వాళ్లు తీసే సినిమాల్లో కంటే ఘాటైన నాన్ వెజ్ డైలాగులు పేలుతున్నాయి. ఎవరూ తగ్గడం లేదు.. వార్నింగులు దాకా వచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో వీరయుద్ధాలు నడుస్తున్నాయి. వాళ్లు తీసే సినిమాల్లో కంటే ఘాటైన నాన్ వెజ్ డైలాగులు పేలుతున్నాయి. ఎవరూ తగ్గడం లేదు.. వార్నింగులు దాకా వచ్చారు. కొత్తగా కేసులు కూడా పెట్టుకుంటున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, కుటుంబాలు వాట్ నాట్… అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు కూడా వీళ్లను చూస్తే ఆశ్చర్యపడేంతగా ఎత్తులు.. పైఎత్తులు మానిఫెస్టోలతో రంగంలో దిగుతున్నారు. ఎందుకంత ప్రస్టేజ్‌గా మారాయి.. వెయ్యి లోపు ఉన్న సభ్యుల కమిటీకి ఇంత పోటీయా? ఇంతగా దిగజారాలా అన్న చర్చ కూడా బయట జరుగుతోంది. నాడు మా లో కీలకంగా వ్యవహరించిన పెద్దలు ఇప్పుడు మౌనమే సమాధానం అంటున్నారు… స్టార్లు హీరోలు టచ్ మీ నాట్ అంటున్నారు… మరి దీనిని ఎవరు పట్టించుకోవాలి? ఇండస్ట్రీ ప్రతిష్ట పోతే వాళ్లకు పోయినట్టు కాదా.? గతంలో 16ఏళ్ల పాటు మా అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరించారు మురళీమోహన్.
MAA తో మురళీ మోహన్ అనుబంధం 5సార్లు అధ్యక్షులు – 3 సార్లు జనరల్ సెక్రటరీ
జనరల్ సెక్రటరీగా…. 1993-95 (అధ్యక్షులు-చిరంజీవి) 1995-97 (అధ్యక్షులు-కృష్ణ) 1997-99 (అధ్యక్షులు-కృష్ణ)
అధ్యక్షులుగా.. 1999-2000 2002-04 2008-10 2010-12 2013-15 ఇంతకాలం MAAలో కీలకంగా వ్యవహరించిన అలాంటి పెద్దలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. నిజంగానే మౌనం ఆశ్రయించారా… ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో మురళీమోహన్ చర్చలో పాల్గొన్నారు.. ఫుల్ వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.- బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్