Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. మరో యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టిన ఆది సాయికుమార్..

ప్రేమ కావలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది సాయికుమార్. ఆతర్వాత లవ్లీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. మరో యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టిన ఆది సాయికుమార్..
Aadi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2021 | 9:07 AM

Aadi Saikumar:  ప్రేమ కావలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది సాయికుమార్. ఆ తర్వాత లవ్లీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు ఆది. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఆది. ఈ క్రమంలో ఇప్పుడు నయా సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్‌లో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆది సాయికుమార్ హీరోగా  కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తొలి ప్రొడక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శ్రీమతి సునీత సమర్పణలో, అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. సూట్ వేసుకున్న హీరో చేతిలో పిస్టల్‌తో టార్గెట్ ఎయిమ్ చేశారు. మరి ఆ టార్గెట్ ఏంటో, ఎందుకో తెలియాలంటే సినిమాలో చూడాలి. ఈ సినిమా ఆది సాయి కుమార్‌కు కొత్త ఇమేజ్‌ని తెస్తుందనే భరోసా కలిగించింది. ఆది సాయికుమార్ ఇటీవల కొత్త తరహా చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆయన చేస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్‌గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss 5 Telugu: అసలు గేమ్ మొదలు పెట్టిన షణ్ముఖ్.. గట్టిగానే క్లాస్ తీసుకున్న యాంకర్ రవి..

Megastar Chiranjeevi : వైష్ణవ్ వచ్చి క్రిష్‌తో సినిమా అనగానే.. ఓకే చేసేయ్ అన్నాను : చిరంజీవి

Maa Elections 2021: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ అన్నారు..! ఆసక్తికర ట్వీట్ చేసిన అజయ్ భూపతి..