Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: నిర్మాతల బాధ్య‌త‌ల‌ గురించి ఆర్ట్ డైరెక్టర్స్ ఆలోచించాలి.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జ‌రిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూత‌న కార్యవ‌ర్గాన్ని స‌న్మానించారు.

Dil Raju:  నిర్మాతల బాధ్య‌త‌ల‌ గురించి ఆర్ట్ డైరెక్టర్స్ ఆలోచించాలి.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
Dil Raju
Follow us
Basha Shek

|

Updated on: Mar 20, 2025 | 6:35 AM

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇత‌ర పాల‌క స‌భ్యులు ఈ సంద‌ర్భంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ”తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్య‌త‌ల‌ గురించి ఆలోచించాల‌ని, క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళదాం” అని చెప్పారు.

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న అధ్య‌క్షుడు రమణ వంక మాట్లాడుతూ.. ”ఆర్ట్ విభాగం అనేది ఇండ‌స్ట్రీలో కీల‌క‌మైంది. సినిమాలో అన్ని విభాగాల్లోకి సాంకేతిక‌త వ‌స్తోంది. ఆర్ట్ విభాగంలోనూ ఏఐ, వర్చువల్ రియాలిటీ టెక్నాల‌జీ మొద‌లైంది. ఈ త‌రుణంలో టెక్నాల‌జీ సంస్థ‌ల‌తో మేము క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాము. మా డిఫ‌ర్ట్‌మెంట్ స‌భ్యులు ఎందుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి అసోషియేష‌న్ కృషి చేస్తుంది” అని తెలిపారు.

డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ.. ”నేను కూడా ఆర్ట్ డైరెక్ట‌ర్‌నే. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచే వ‌చ్చి డైరెక్ట‌ర్ అయ్యాను. ఆర్ట్ విభాగం విలువ నాకు తెలుసు. ఇత‌ర భాష‌ల వారిని తెచ్చుకోకుండా అద్భుత‌మైన టాలెంట్ ఉన్న తెలుగు ఆర్ట్ డైరెక్ట‌ర్ల‌నే తీసుకొండి. బాధ్య‌త‌లు స్వీక‌రించిన తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గానికి అభినంద‌న‌లు.” అని దిల్ రాజు చెప్పారు.

ఇవి కూడా చదవండి

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ.. ”మా ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో మా డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది. సినిమాకు బ్యాక్ బోన్‌గా నిల‌బ‌డి ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. డైరెక్ట‌ర్ల త‌ర్వాత అంత‌టి కృషి కూడా వారిదే కాబ‌ట్టి వారిని ఆర్ట్ డైరెక్ట‌ర్లు అంటున్నాం. ఆర్ట్ డైరెక్ట‌ర్ల స‌మ‌స్య‌లు కూడా తీరాల‌ని కోరుకుంటూ నూత‌న కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.” అని అన్నారు.

ప్రధాన కార్యదర్శి కె.ఎం. రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. ”అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చిన కూడా వారికీ అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఎటువంటి భేషజాలు లేకుండా అందరికి సమ న్యాయం చేసి వారు వృత్తి పరంగా, ఆర్థిక పురోగతికి అండగా ఉండేలా అసోసియేషన్ తరఫున కృషి చేస్తాం” అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో వైవీఎస్ చౌద‌రి త‌దిత‌రులు పాల్గొని నూత‌న కార్యవ‌ర్గాన్ని స‌న్మానించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌