Tollywood: ఆ టాలీవుడ్ హీరోయిన్ విడాకులు తీసుకోనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
ఈ మధ్యన సెలబ్రిటీల విడాకుల వార్తలు తరచూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించి ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.ఇటీవల మరో టాలీవుడ్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకోనుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విడాకుల వార్తలపై హీరోయినే స్వయంగా స్పందించింది.

మలయాళ హీరోయిన్ భావన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. గోపిచంద్ ఒంటరి, శ్రీకాంత్ మహాత్మ తదితర సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. రవితేజ నిప్పు, నితిన్ హీరో సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల్లోనే కనిపించింది. అలాగే కొన్ని కన్నడ సినిమాల్లోనూ మెరిసింది. అయితే ఓ స్టార్ హీరో నిర్వాకం వల్ల ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడం తగ్గించేసింది. కొన్నేళ్ల క్రితం కొందరు దుండుగులు భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో క్రమంగా సినిమాలు చేయడం తగ్గించేసిందీ అందాల తార. ఆ తర్వాత 2018లో ప్రముఖ కన్నడ నిర్మాత నవీన్ రమేశ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటోంది. అయితే ఇప్పుడు భావన తన భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నెట్టింట ఈ వార్తలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భావన తనపై వస్తున్న విడాకుల వార్తలపై స్పందించింది.
‘నేను విడాకులు తీసుకుంటున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను సామాజి మాధ్యమాల్లో షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందులో భాగంగానే నా భర్తతో దిగిన ఫొటోలను కూడా నెట్టింట పంచుకోవడం లేదు. ఇలా చేయడం వల్లే ఇప్పుడు కొందరు నా విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా. నేను యాదృచ్ఛికంగా ఫొటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తున్నారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా’ అని విడాకుల వార్తలను కొట్టి పారేసింది భావన.
భావన లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ట్రెడిషినల్ శారీలో భావన..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.