AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikandar: ఫైనల్లీ సికిందర్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. వేరే రోజే దొరకలేదా అంటోన్న సల్మాన్ ఫ్యాన్స్

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న ల కొత్త చిత్రం 'సికంధార్' ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసింది.

Sikandar: ఫైనల్లీ సికిందర్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. వేరే రోజే దొరకలేదా అంటోన్న సల్మాన్ ఫ్యాన్స్
Sikandar Movie
Basha Shek
|

Updated on: Mar 23, 2025 | 11:37 AM

Share

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తయింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినప్పటికీ సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ముందుగా చెప్పిన తేదీకే షూటింగ్ పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న తొలిసారి సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈద్‌ను మాత్రమే కాకుండా హిందూ పండుగను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా విడుదల తేదీని నిర్ణయించారు.

సాధారణంగా సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు ఈద్, రంజాన్ పండుగల సమయంలో విడుదల కావడం సర్వసాధారణం. ‘సికందర్’ షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే, ఈద్ కు ఈ సినిమా విడుదల అవుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఈద్ కు ముందే విడుదలవుతోంది. ఈద్ మాత్రమే కాకుండా ఉగాది పండుగను కూడా పరిగణనలోకి తీసుకుని విడుదల తేదీని నిర్ణయించింది చిత్ర బృందం. ‘సికందర్’ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది పండుగ కూడా అదే రోజున జరుపుకుంటారు. ఉగాది పండుగను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. చాలా రాష్ట్రాల్లో ఉగాది పండుగకు సెలవు కూడా ఉంది. గుడి పద్వా పండుగ కూడా అదే రోజున జరుపుకుంటారు. ఈద్ మరుసటి రోజు, మార్చి 31న జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాలలో, ఈద్‌ను ఏప్రిల్ 1న కూడా జరుపుకుంటారు. అయితే మార్చి 30న ఉగాది పండగ ఈ సారి ఆదివారం రానుంది. దీంతో రెండు రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సల్మాన్ అభిమానులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సికందర్’. ఆయన గతంలో ‘గజిని’, ‘కత్తి’, ‘తుపాకి’, ‘సర్కార్’, ‘దర్బార్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.   ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్వాలా నిర్మించారు.

ఆదివారం సినిమా రిలీజ్ ఏందయ్యా!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!