Shiva Rajkumar: తండ్రి అడుగు జాడల్లోనే కూతురు.. సినిమాల్లోకి శివన్న గారాల పట్టి.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, గీత శివ రాజ్ కుమార్ ల చిన్న కుమార్తె నివేదిత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గతంలో కొన్ని వెబ్ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె ఇప్పపుడు తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంలోని మూడవ తరం కూడా సినిమాల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే రాఘవేంద్ర రాజ్ కుమార్ ఇద్దరు కుమారులు ప్రముఖ నటులుగా ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారు. ఇక దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇద్దరు కూతుళ్లు ఇంకా చిన్నవాళ్లు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి వారికి చాలా సమయం ఉంది. ఇక శివన్న పెద్ద కూతురు డాక్టర్ గా స్థిర పడిపోయింది. అయితే ఆయన చిన్న కూతురు నివేదిత ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెడుతోంది. తల్లి, అత్త, అమ్మమ్మ లాగానే సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనుంది. ‘శ్రీ ముత్తు సినీ సర్వీసెస్ అండ్ ప్రొడక్షన్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన నివేదిత శివరాజ్‌కుమార్, తర మొదటి చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఒక ప్రత్యేక రోజున విడుదలవుతోంది. నివేదిత ‘ఫైర్‌ఫ్లై’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇది రాజ్ కుమార్ జయంతి అయిన ఏప్రిల్ 24న విడుదల కానుంది. వేదిత నిర్మించిన మొదటి చిత్రం ‘ఫైర్‌ఫ్లై’లో వంశీ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమాకు దర్శకత్వం కూడా ఆయనే వహించారు. అచ్యుత్ కుమార్, సుధారాణి, రచనా ఇందర్, శీతల్ శెట్టి, ఆనంద్ నినాసం, చిత్కల బిరాదార్, మరియు మూగు సురేష్ వంటి ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన నటులు ఈ చిత్రంలో నటించారు.
తన కూతురి మొదటి సినిమా గురించి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, ‘నా కూతురి మొదటి సినిమా అప్పాజీ పుట్టినరోజున విడుదల కావడం నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. మా కుటుంబం పట్ల ప్రజలు చూపించిన ప్రేమ అంతా అప్పాజీ నుంచే వచ్చింది. ప్రతి ఒక్కరూ తరువాతి తరం పట్ల ఒకే రకమైన ప్రేమను చూపించడం చూడటం చాలా ఆనందంగా ఉంది. మాకు నిరంతరం మద్దతుగా నిలుస్తోన్న అభిమానులు, కన్నడ సినిమా ప్రేమికులందరికీ ధన్యవాదాలు. ఫైర్‌ఫ్లై అనేది కచ్చితంగా ఓ డిఫరెంట్ సినిమా. ఇంత లోతైన కథను సరళంగా, హాస్యభరితంగా చెప్పగలగడం నాకు చాలా దగ్గరగా అనిపించింది. ప్రతి ఒక్కరూ దీనిని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
భార్య, కూతురితో శివన్న..
View this post on Instagram
‘ఫైర్‌ఫ్లై’ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలను చాలా అందంగా కంపోజ్ చేశారని చిత్ర బృందం నమ్ముతుంది. ఈ చిత్రంలోని పాటను ఉగాది పండుగకు విడుదల చేయనున్నారు. జయరామ్ శ్రీనివాస్, హ్యాపీ హనుమంత్ ఈ సినిమాకు సహ దర్శకత్వం వహించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.