Charan Raj: 400 సినిమాలు.. తెలుగులో పాపులర్ విలన్.. ఈ నటుడి ఆస్తులు ఏ హీరోకు తక్కువ కాదు తెలుసా.. ?
చరణ్ రాజ్.. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన విలన్లలో ఆయన ఒకరు. ఇంతకీ ఇప్పుడైనా గుర్తుపట్టారా.. ?

దక్షిణాదిలో ఒకప్పుడు అద్భుతమైన నటనతో భయపెట్టిన విలన్స్ చాలా మంది ఉన్నారు. అందులో చరణ్ రాజ్ ఒకరు. 90‘s లో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు కదా. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషలలో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అరణ్య కాండ, దొంగమొగుడు, స్వయంవరం, సూర్య ఐపీఎస్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కనిపించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
ఒకప్పుడు తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన చరణ్ రాజ్.. ఇప్పుడు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు చిరు, నాగ్ వంటి స్టార్ హీరోలతో నటించిన చరణ్ రాజ్.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని హీరోల సినిమాల్లోనూ నటించారు. ఇప్పటికీ సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం చరణ్ రాజ్ ఆస్తులు, లైఫ్ స్టైల్ గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ప్రస్తుతం చరణ్ రాజ్ చెన్నైలో నివసిస్తున్నాడు. అతడు తన సంపాదనను ఎక్కువ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టాడు. బెంగుళూరుకు సమీపంలో 1984లో 22 ఎకరాల భూమిని కేవలం రూ.54 వేలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.4 కోట్లు. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.100 కోట్లు ఉంటుంది. దాదాపు 11 భాషలలో నటించారు. ఇప్పుడు ఆయన తనయుడు హీరోగా రాణిస్తున్నారు. తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ రాజ్ తనయుడు తేజ్.. నరకాసుర సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..








