Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thammudu: తమ్ముడు సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? అతను తప్పుకోవడంతోనే లైన్‌లోకి నితిన్

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (జులై 04) న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సినిమాకు మొదట నితిన్ ను హీరోగా అనుకోలేదట మేకర్స్. మరో క్రేజీ తప్పుకోవడంతో నితిన్ కు ఛాన్స్ వచ్చింది.

Thammudu: తమ్ముడు సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? అతను తప్పుకోవడంతోనే లైన్‌లోకి నితిన్
Nithiin Thammudu Movie
Basha Shek
|

Updated on: Jul 04, 2025 | 11:48 AM

Share

నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా శుక్రవారం (జులై 04)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అలాగే వర్ష బొల్లమ్మ, లయ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తమ్ముడు సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్, ట్రైలర్లు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించడంతో సినిమపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కాగా తమ్ముడు సినిమా నితిన్ కు చాలా కీలకం. ఎందుకంటే ఈ హీరో సక్సెస్ చూసి చాలా ఏళ్లైంది. కాబట్టి తమ్ముడు మూవీతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని నితిన్ చూస్తున్నాడు. అయితే తమ్ముడు సినిమాకు నితిన్ ను హీరోగా అనుకోలేదట. అందుకు ముందు న్యాచురల్ స్టార్ నానితో ఈ మూవీని తెరకెక్కించాలని డైరెక్టర్ భావించారట. అప్పటికే వీరి కాంబినేషన్ లో ఎమ్‌సీఏ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. కాబట్టి మరోసారి ఈ కాంబోను రిపీట్ చేయాలని దిల్ రాజు భావించారట. చివరకు నానికి కథను కూడా వినిపించారట. న్యాచురల్ స్టార్ కు కూడా ఈ సినిమా కథ బాగా నచ్చేసింది. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. ఫలితంగా ఈ మూవీ కథ ఫైనల్ గా నితిన్ దగ్గరకు వెళ్లింది.

తమ్ముడు సినిమాను న్యాచురల్ స్టార్ నానితో తీద్దామనుకున్నట్లు దిల్ రాజు ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. కథ బాగుంది కాబట్టే నితిన్ ను హీరోగా ఎంచుకుని భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించామని ఆయన పేర్కొన్నారు. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక , హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితర ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ అందించగా , సినిమాటోగ్రాఫర్ ఆ కెవి గుహన్ వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో