Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: ఫస్ట్ సినిమాకే బ్లాక్ బస్టర్.. లగ్జరీ కారు కొన్న కోర్ట్ మూవీ హీరోయిన్.. ధర తెలిస్తే షాకే..

ఒకే ఒక్క సినిమాతో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీదేవి. తొలి సినిమాలో అందం, సహజ నటనతో ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా లగ్జరీ కారు కొనేసింది. ఇంతకీ ఆ కారు ధరెంతో తెలుసా.. ?

Sridevi: ఫస్ట్ సినిమాకే బ్లాక్ బస్టర్.. లగ్జరీ కారు కొన్న కోర్ట్ మూవీ హీరోయిన్.. ధర తెలిస్తే షాకే..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2025 | 11:16 AM

Share

తొలి సినిమాతోనే తెలుగు సినీరంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీదేవి. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టలేరు కానీ.. కోర్టు సినిమాలో జాబిలి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకు ముందు వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. కానీ కోర్టు మూవీతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది.

కొత్త కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ హెక్టార్ కారును పోస్ట్ చేసింది శ్రీదేవి. ఈ కారు ధర రూ.25 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే తన అనుకున్న కలను నెరవేర్చుకుంది. కోర్టు సినిమాకు ఈ అమ్మడు రూ.10 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సరైన క్లారిటీ రాలేదు. కానీ ఈ మూవీతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆమెకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ సైతం పెరిగారు. అలాగే ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక శ్రీదేవి విషయానికి వస్తే..

ఆమె అసలు పేరు శ్రీదేవి ఆపళ్ల. కాకినాడకు చెందిన ఈ అమ్మడు ఇన్ స్టాలో రీల్స్ చేస్తుండేది. కోర్ట్ సినిమాకు కథానాయిక కోసం డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకున్న సమయంలోనే శ్రీదేవి చేసిన ఇన్ స్టా రీల్ చూశారట. దీంతో ఆమెను పిలిపించి ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది శ్రీదేవి.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..